హీరో నాగశౌర్య మోకాలికి బలమైన గాయం తగిలింది. డాక్టర్లు నాలుగు వారాల పాటు విశ్రాంతి తప్పదని చెప్పడంతో షూటింగ్ ఆపాల్సి వచ్చింది. ప్రస్తుతం తన స్వంత బ్యానర్ మీద విశాఖలో సినిమా షూట్ లో వున్నాడు నాగశౌర్య. కేజిఎఫ్ లాంటి సినిమాకు పని చేసిన ఫైట్ మాస్టర్ అన్ భైరవ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్లు తీస్తున్నారు. డూప్ లు లేకుండా, రోప్ లు లేకుండా బిల్డింగ్ ల మీద నుంచి జంప్ ల లాంటి షాట్ లు తీస్తుండగా, మోకాలికి గట్టి గాయం తగిలింది.
15 అడుగుల పై నుంచి దూకినపుడు మోకాలి దగ్గర డిస్ లోకేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడం, ట్రీట్ మెంట్ చేసి, నాలుగు వారాలు రెస్ట్ అవసరం అని చెప్పడంతో నాగశౌర్య వెనక్కు తిరిగి వచ్చారు.
ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఛలో, నర్తనశాల తరువాత ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు అశ్వద్ధామ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. కొత్త దర్శకుడు ఈ సినిమాకు పని చేస్తున్నారు.