అవును, చంద్రబాబు కోర్టుకెళ్లొచ్చు కదా?

చంద్రబాబునాయుడు దగ్గర లాపాయింటు చాలానే ఉంది.తన జమానాలో రైతులకు రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చాను గనుక… జగన్ మోహన రెడ్డి దానిని చెల్లించి తీరాల్సిందే అని ఆయన ఇపుడు పట్టుపడుతున్నారు.ఇది జగన్ ప్రభుత్వం తప్పనిసరిగా…

చంద్రబాబునాయుడు దగ్గర లాపాయింటు చాలానే ఉంది.తన జమానాలో రైతులకు రుణమాఫీ చేస్తానని హమీ ఇచ్చాను గనుక… జగన్ మోహన రెడ్డి దానిని చెల్లించి తీరాల్సిందే అని ఆయన ఇపుడు పట్టుపడుతున్నారు.ఇది జగన్ ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన సంగతి అని ఆయన అనుకుంటున్నారు.కాబట్టి జగన్ ను నిలదీస్తున్నారు.జగన్ గనుక రుణమాఫీ చెల్లించకపోతే..ఈ విషయంపై కోర్టుకు వెళ్తా అని చంద్రబాబునాయుడు బెదిరిస్తున్నారు. నిజమే..ఇలా అసెంబ్లీలో ముఖ్యమంత్రిని దేబిరించే బదులు.. ఎంచక్కా చంద్రబాబునాయుడు కోర్టుకు వెళ్లి.. జగన్ ప్రభుత్వం చేతగానితనాన్ని రచ్చకీడ్చవచ్చు కదా…!

అక్కడే ఉంది మతలబు. ఇలా సభలో ఆడంబరంగా ప్రకటించాల్సిదే తప్ప.. ఈ విషయంలో కోర్టుకు వెళ్లేంత ధైర్యం చంద్రబాబుకు ఉండకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.దీనికి చాలా రకాల సంభావ్యతలు ఉన్నాయి.రైతులందరికీ రుణమాఫీ చేస్తాననే ఒక బూటకపు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అయిదు విడతల్లో చెల్లిస్తానని మాటమార్చిన చంద్రబాబునాయుడు తన అయిదేళ్ల పాలన కాలంలో కేవలం మూడు విడతలు మాత్రమే చెల్లించారు. 4, 5 విడతల చెల్లింపులకు ప్రభుత్వం తరఫున హామీ పత్రాలిచ్చారు.అంతటితో రైతులకు టోపీ పెట్టి.. చేతులు దులుపుకున్నారు. తానిచ్చిన హామీ పత్రాలకు జగన్ చెల్లించాలనేది చంద్రబాబు డిమాండు.

ఇలా శాసనసభలో, ప్రెస్ మీట్లలో బెదిరిస్తూ గడపాల్సిందే తప్ప.. ఆ రకంగా జగన్ కు అపకీర్తి రావాలని ప్రయత్నించాల్సిందే తప్ప కోర్టుకు వెళ్లడానికి ఆయనకు ధైర్యం చాలకపోవచ్చు.అలా కోర్టుకు వెళితే గనుక..ఆయన ఎప్పుడు హామీ ఇచ్చాడు.ఆ తర్వాత.. తన ప్రభుత్వ హయాంలో 4,5 విడతలు ఎందుకు చెల్లించలేదు… కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే.. రైతుల చెల్లింపులు చేయకుండా.. ఇతరత్రా ప్రజలకు పంచిపెట్టడానికి ఎన్ని వేల కోట్లు తగలేశారో కూడా చంద్రబాబు కోర్టుకు చెప్పాల్సి వస్తుంది.

అందుకే.. ఇలా జగన్ ను నిలదీసి డ్రామాలు చేసే బదులుగా చంద్రబాబు నాయుడు ఆయన చెబుతున్నట్లుగానే ఏకంగా కోర్టుకు వెళితే.. అటో ఇటో తేలిపోతుంది కదా.. అని పలువురు అనుకుంటున్నారు.