చంద్రబాబు, జపాన్ నుంచి నరుక్కొచ్చారా?

కేంద్ర ప్రభుత్వం- కాశ్మీరు విషయంలో కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటేనే.. అది భారత్ అంతర్గత వ్యవహారం.. మేం జోక్యం చేసుకోబోయేది లేదు.. అని ప్రకటిస్తూ… ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాలు తమ గౌరవం కాపాడుకుంటున్నాయి.…

కేంద్ర ప్రభుత్వం- కాశ్మీరు విషయంలో కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటేనే.. అది భారత్ అంతర్గత వ్యవహారం.. మేం జోక్యం చేసుకోబోయేది లేదు.. అని ప్రకటిస్తూ… ప్రపంచంలోని అనేక ప్రధాన దేశాలు తమ గౌరవం కాపాడుకుంటున్నాయి. అలాంటిది.. ఒక రాష్ట్రంలో- ఒక ప్రభుత్వ హయాంలో జరిగిన చీకటి ఒప్పందాల గురించి… స్వాహా పర్వాల గురించి ‘సమీక్ష’కు ఆదేశించినందుకే.. ఇతర దేశాలు కంగారు పడడం ఏమిటి? ఏపీలో చంద్రబాబు పాలనలో జరిగిన విద్యుత్తు ఒప్పందాలు, పీపీఏలపై సమీక్షకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇలాంటి సమీక్ష కరెక్టు కాదంటూ.. జపాన్ మంత్రి ఏపీ సర్కారుకు లేఖ రాశారనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. జపాన్ ను ఎంతగా నెత్తిన పెట్టుకుని ఊరేగారో అందరికీ తెలుసు. మన రాజధాని నగరం మొత్తాన్నీ జపాన్ ప్రభుత్వమే కట్టిస్తుంది… అంటూ రకరకాల స్కీములు ప్రకటించారు. ఆ దేశానికి పలు బృందాలను టూర్లకు పంపారు. డిజైన్లు కూడా రెడీ అయ్యాయి అన్నారు. జపాన్ మరియు ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లాంటివి అనేపదం వాడడం ఒకటే తక్కువ.. అంతకంటె మిన్నగా ఆ దేశానికి ప్రాధాన్యం కట్టబెట్టారు.

జపాన్ ప్రభుత్వంతో మనం అనేక ఒప్పదాలు చేసేసుకుంటున్నాం అని.. మన కుర్రాళ్లు ఇక బీటెక్ పూర్తిచేస్తూ జపనీస్ భాష కాస్త నేర్చుకున్నారంటే.. అందరికీ జపనీస్ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేస్తాయని అన్నారు. ఆయన మాటలు నమ్మి కొన్ని యూనివర్సిటీలు జపనీస్ భాషను నేర్పించే చాలా కోర్సులను కూడా ప్రారంభించాయి. ఆ తర్వాత జపాన్ ప్రభుత్వం రాజధాని విషయంలో ఎంతగా ముందుకు వచ్చిందో.. అంతగా వెనక్కుపోయింది. ఎందుకు వెనక్కెళ్లారో కూడా తెలియదు. చంద్రబాబు కూడా చప్పుడు చేయకుండా, తేలుకుట్టిన దొంగ సామెత చందంగా మిన్నకుండిపోయారు.

అయితే ఇప్పుడు విద్యుత్తు పీపీఏల సమీక్ష అనగానే.. అలాంటి తగదని, విదేశీ పెట్టుబడి దార్లపై అది ప్రభావం చూపిస్తుందని పేర్కొంటూ జపాన్ మంత్రి ఒకరు సీఎం జగన్ కు లేఖరాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పీపీఏల సమీక్ష అనగానే.. తెలుగుదేశం మొత్తం చాలా రోజులుగా కంగారు పడిపోతోంది. తామేమీ చేయలేక విదేశీ ప్రభుత్వాల వైపునుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేలా చంద్రబాబు చక్రం తిప్పుతున్నారేమో అని ప్రజలు భావిస్తున్నారు. అయినా అవినీతి జరిగిందో లేదో లెక్క తేల్చడానికి ప్రయత్నం జరుగుతోంటే.. నీతికి తాము నిదర్శనం అని చెప్పుకునే జపాన్ ఇలా స్పందించడమే చిత్రంగా ఉంది.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!