Advertisement

Advertisement


Home > Politics - Gossip

కోట్లమందికి రుచించనున్న జగన్ నిర్ణయం

కోట్లమందికి రుచించనున్న జగన్ నిర్ణయం

జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఇప్పటిదాకా అవినీతి నిర్మూలన, సంక్షేమం అనే రెండు అంశాల మీదనే దృష్టి పెడుతున్నారు. ప్రజలకు బాగా సేవలందిస్తున్న కొన్ని పథకాలను మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు తనవంతు కష్టం పడుతున్నారు. ఆ క్రమంలో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగన్ సూచనల మేరకు, రాష్ట్రంలో అయిదులక్షల రూపాయల ఆదాయం దాటని ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. అలాగే వెయ్యిరూపాయలకు మించి వైద్య ఖర్చు అయ్యేట్లయితే... వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇవి చాలా మేజర్ నిర్ణయాలు. వైద్య ఖర్చులకోసం ఆస్తులను తెగనమ్ముకుంటున్న, అనేకానేక అవస్థలు పడుతున్న ప్రజలు ఉన్న ఈ రోజుల్లో.. ఖర్చు వెయ్యి దాటితే చాలు.. ఆ కుటుంబాన్ని ఆదుకోడానికి ప్రభుత్వం ముందుకు రావడం చాలా గొప్ప పరిణామం.

అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా క్యాన్సర్ , కిడ్నీ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రుల ఏర్పాటు సిద్ధంకావడం, 108, 104 వాహనాలను ఎప్పుడూ కండిషన్ లో ఉంచాలని సూచించడం, ప్రతి ఆరేళ్లకు ఓసారి కొత్తవాహనాలు సమకూర్చుకునేలా సిద్ధం చేయాలనడం ఇవన్నీ కూడా వ్యవస్థను మెరుగు పరిచే ఆలోచనలుగా చెప్పుకోవాలి.

అన్నింటినీ మించి... మరో గొప్ప నిర్ణయం కూడా జగన్ తీసుకున్నారు. హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు నగరాల్లోని 150 ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించాలని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలలో కొన్ని రకాల ఆరోగ్యసమస్యలతో బాధపడేవారికి ఇది చాలా పెద్ద ఉపశమనం అని చెప్పాలి.

స్థానికంగా రోగ నిర్ధరణ జరిగిన సందర్భాల్లో.. పరిశీలించిన నిపుణులు.. హైదరాబాదులో దానికి సంబంధించి మంచి ఆస్పత్రులు ఉన్నాయని చెప్పడం, అయితే హైదరాబాదులో ఆరోగ్యశ్రీ వర్తించకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు.

ఏపీలో ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలకు ఇది అవమానం కాకపోయినప్పటికీ.. ఆయా నగరాలకు దగ్గర్లో ఉండే జిల్లాల వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుండేది. ఏ ఆస్పత్రిలో వైద్యసేవలు చేయించుకున్నా దానికి ఆరోగ్యశ్రీ ద్వారా చెల్లించే బిల్లులు ఒకేతీరుగా ఉంటాయి.

అలాంటప్పుడు రాష్ట్రాల వారీ సరిహద్దులు గీసి కొందరిని ఇబ్బందులకు గురిచేయడంలో అర్థంలేదు. సరిగ్గా ఆ అంశాన్నే జగన్ మోహన్ రెడ్డి పట్టించుకున్నారు. ఈ నిర్ణయంతో కొన్ని లక్షల మందికి అదనంగా ఉపయోగం జరుగుతుందనడంలో సందేహం లేదు.

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?