Advertisement

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు : ఎవెరీ వీకెండ్, ఛలో హైద్రాబాద్

చంద్రబాబు : ఎవెరీ వీకెండ్, ఛలో హైద్రాబాద్

చంద్రబాబునాయుడు తాను ముఖ్యమంత్రిగా అయిదేళ్ల కాలంలో... జగన్మోహన రెడ్డి మీద ఒక తరహా విమర్శలతో విరుచుకుపడుతూ ఉండేవాడు. తనమాటల్ని ప్రజలు నమ్ముతున్నారా? లేదా, తననే అనుమానిస్తున్నారా.. అనే క్రాస్ చెక్ లేకుండా మాట్లాడేస్తూ ఉండే చంద్రబాబునాయుడు.. స్టీరియో టైపు విమర్శలతో విరుచుకుపడుతుండేవారు. ఇప్పుడు ఆయన స్వయంగా అప్పటి విమర్శలకంటె తక్కువ స్థాయిలో ప్రవర్తించాల్సి రావడం అనేది చోద్యంగా కనిపిస్తోంది.

గత అయిదేళ్లలో - జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో కూర్చుని ఏపీ రాజకీయం నడుపుతున్నాడంటూ... చంద్రబాబు ఎన్నిసార్లు ఆరోపించి ఉంటారో లెక్కేలేదు. తానొక్కడే చిత్తశుద్ధి గల రాజకీయ నాయకుడిని గనుక.. ఏపీలోనే నివాసం ఉంటూ పాలన సాగిస్తున్నానని, జగన్ కు అదిలేదని తప్పుపట్టేవాళ్లు. నాలుగేళ్లు గడిచేసరికెల్లా.. జగన్ విజయవాడలోనే సొంతంగా ఇల్లు కూడా కట్టుకుని అక్కడ నివాసం ప్రారంభించారు.  చంద్రబాబు మాత్రం అయిదేళ్లు పాలన సాగించిన తర్వాత కూడా... విజయవాడలో కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా.. అక్రమంగా నిర్మించిన ఇంటిలోనే అద్దెకు ఉంటూ రాజకీయం చేస్తున్నారు.

ఇప్పటికీ హైదరాబాదులోనే సొంత ఇల్లు ఉన్న చంద్రబాబు.. ప్రతి వీకెండ్ ‘ఇంటికెళ్లిపోవడానికి’ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన తెలంగాణ పార్టీ నాయకులతో మాట్లాడుతూ... ప్రతి శని లేదా ఆదివారాల్లో తెలంగాణ పార్టీకోసం సమయం కేటాయిస్తానని... పార్టీ రాష్ట్ర నాయకులతో ప్రతి వారాంతంలో సమావేశం అవుతానని సెలవిచ్చారు. ఎంపీ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తామని అన్నారు. ఇవన్నీ కూడా వీకెండ్ లోనే జరుగుతుంటాయన్నమాట.

మొత్తానికి చంద్రబాబు.. అటు విజయవాడలో స్థిర నివాసం ఉండకపోగా, ప్రతి వీకెండ్ నూ తన ఫ్యామిలీ టైంగా మార్చుకోవడానికి.. హైదరాబాదులోని కుటుంబం వద్దకు వెళ్లిపోవడానికి... తెలంగాణ పార్టీ సముద్ధరణ పేరుతో ఒక సింపుల్ స్కెచ్ వేశారని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు. తానేదో పార్టీకోసమే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుందని.. ప్రతి వీకెండ్ ఛలో హైదరాబాద్ అంటుంటారని... జనం నవ్వుకుంటున్నారు. అయిదేళ్లు పాలించినా.. రాజధానిలో సొంత ఇల్లు అనే ఆలోచన చంద్రబాబుకు రాకపోవడం చిత్రమే.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?