ఆయన్ని చేర్చుకోవడం చంద్రబాబును తిట్టడానికే

కొందరు నాయకులకు సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది! ఎలాంటి సందర్భంలో, ఎలాంటి వేదిక మీదినుంచి మాట్లాడాల్సి వచ్చినాసరే.. ఆ ఒక్క పాయింటు మీద మాత్రం వారు అనర్గళంగా… అత్యంత అథారిటీతో మాట్లాడేస్తుంటారు. పార్టీలు కూడా..…

కొందరు నాయకులకు సింగిల్ పాయింట్ ఎజెండా ఉంటుంది! ఎలాంటి సందర్భంలో, ఎలాంటి వేదిక మీదినుంచి మాట్లాడాల్సి వచ్చినాసరే.. ఆ ఒక్క పాయింటు మీద మాత్రం వారు అనర్గళంగా… అత్యంత అథారిటీతో మాట్లాడేస్తుంటారు. పార్టీలు కూడా.. వారిని ‘ఆ ఒక్క’ అంశం మీద మాట్లాడించడానికే ఎక్కువగా ప్రేరేపిస్తుంటాయి. అలాంటి నాయకుల్లో… తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు కూడా ఒకడు. ఆయనకున్న సింగిల్ పాయింట్ ఎజెండా చంద్రబాబునాయుడును దూషించడం! ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు.

ఇంతకుమించి ఇంకేమీ ఉపోద్ఘాతం చెప్పవలసిన అవసరం లేదు. రాజకీయ జీవితంలో సూపర్ సీనియర్ స్థానానికి చేరుకున్న.. తనకు ప్రజాప్రతినిధి పదవుల మీద కోరిక తగ్గిపోయి… ఓసారి గవర్నర్ అయితే… శేషజీవితం గడిపేయవచ్చునని… కొన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న మోత్కుపల్లి నరసింహులు… ఇప్పుడు భాజపా తీర్థం పుచ్చుకుంటూ ఉండడం విశేషమే.

మోత్కుపల్లి నరసింహులు చాలాకాలం కిందటే క్రియాశీల రాజకీయాల నుంచి డీయాక్టివేట్ అయ్యారు. తెలుగుదేశంలో ఉన్నంత కాలమూ… ఆయనకు చంద్రబాబు, గవర్నర్ పోస్టు ఆశపెడుతూ వచ్చారు. 2014లో భాజపాతో జట్టు కట్టి.. ఎన్డీయేలో భాగస్వామిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత… అక్కడ మాట నెగ్గించుకోగలరని, తనకు ఇచ్చిన గవర్నరు గిరీ మాట నిలబెట్టుకుంటారని మోత్కుపల్లి చాలాకాలం నిరీక్షించారు. కానీ ఫలం దక్కలేదు.

తెరాసతో బంధం గురించి వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసి.. పార్టీనుంచి సస్పెండ్ అయ్యారు. అప్పటినుంచి ఆయన చంద్రబాబును దూషించడం, ఆయన లోపాలను ప్రపంచానికి చెప్పడం, ఎప్పట్లో ఎలాంటి మోసాలకు పాల్పడ్డారో చెప్పడం అనేది మాత్రమే… తన ఎజెండాగా మార్చుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెండెంటు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. పలు సందర్భాల్లో ఏపీకి వచ్చి మరీ చంద్రబాబును తిట్టి వెళ్లారు.

ఇన్నాళ్లు పార్టీ ముద్రలేకుండానే రోజులు వెళ్లదీసిన మోత్కుపల్లి ఇప్పుడు భాజపాలో చేరుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రబాబును ఎండగట్టడానికి తమకు బాగా ఉపయోగపడుతాడని పార్టీ భావిస్తుండవచ్చు. తెలంగాణలో తెదేపా కథ ముగిసిపోయినప్పటికీ… ఏపీలో కూడా తమ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నా భాజపా, మోత్కుపల్లిని దూషణాస్త్రంగా వాడే అవకాశాలే కనిపిస్తున్నాయి.

అలాంటి జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కోటలు కూలిపోయాయి

అడవిశేష్ తో రెజీనా స్పెషల్ చిట్ చాట్