కొన్నాళ్ల క్రితం చినబాబు లోకేష్ భాజపా నాయకుడు అమిత్ షా ను కలిసారని, మాట్లాడారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఇరు వర్గాలు ఖండించలేదు. ధృవీకరించలేదు.
అయితే విశ్వసనీయ రాజకీయ వర్గాల ఆలస్యంగా అందిన సమాచారం వేరుగా వుంది. లోకేష్ కాదు కానీ చంద్రబాబు నేరుగా భాజపా పెద్దలతో మాట్లాడారన్నది ఆ సమాచారం. అయితే అలా మట్లాడింది నేరుగా కలిసి కాదు. జూమ్ కాల్ లో అని తెలుస్తోంది. అయితే ఇది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారమే కానీ ధృవీకరించినది కాదు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం భాజపా లోని కొందరు నాయకులతో చంద్రబాబు టచ్ లో వున్నారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఓ మీడియా అధినేత తన పలుకుబడి ఉపయోగించి భాజపా టాప్ లెవెల్ నేతతో జూమ్ కాల్ కు ఏర్పాట్లు చేసారని తెలుస్తోంది. భాజపా అధినేత ఒకరు హైదరాబాద్ వచ్చినపుడు ఈ జూమ్ కాల్ ఏర్పాట్లు జరిగాయని తెలుస్తోంది.
జూమ్ కాల్ లో భాజపా అధినేతతో చంద్రబాబు మాట్లాడిన విషయాల్లో కీలకమైనది జనసేనతో తెలుగుదేశం కలవడం అన్నదే అని తెలుస్తోంది. పవన్ ను దగ్గరకు తీసినా తమకు అభ్యంతరం లేదని భాజపా అధినేత ఒకరు జూమ్ కాల్ లో క్లారిటీ ఇచ్చిన తరువాతే పవన్ – బాబుల సమావేశం జరగిందని తెలుస్తోంది.
అయితే ఇంతకీ ఈ జూమ్ కాల్ వ్యవహారాలకు, చంద్రబాబు కు భాజపా వైపు నుంచి స్నేహ హస్తం రావడానికి వెనుక జరుగుతున్న సంగతులు అన్నీ సదరు మీడియా అధినేత మీడియేషన్ లోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. కానీ ఇవన్నీ మోడీ కి ఎంతవరకు తెలుసు అన్నదే తెలియాల్సిన పాయింట్.