Advertisement

Advertisement


Home > Politics - Gossip

చానెల్ చానెల్ కొట్టుకుంటే...

చానెల్ చానెల్ కొట్టుకుంటే...

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుని దొరలై పోతుంటే వాటా దొరకని వాడు వేరే పార్టీ పెడతాడు అంటాడు ఆత్రేయ ఓ పాటలో. కానీ దొంగలు దొంగలు కొట్టుకుంటే, జరిగిన దొంగతనాలు అన్నీ బయటకు రావూ. ఎందుకు రావు. వస్తాయి. కానీ  దొంగల వెనుక వున్నవారు రానిస్తే కదా.. 

పిచ్చోళ్ల లారా మీరు..మీరు కొట్టుకుని ఎందుకురా? మీ కన్నాలు అన్నీ బయట పెట్టుకుంటారు అని కాస్త మందలిస్తారు. అవసరం అయితే రెండు మాటలు అని, మూలన కూర్చో పెడతారు. ఆపై అవును నిజమే కదా, అని ఆ ఇద్దరూ బుద్దిగా మౌనం వహిస్తారు. అప్పటి వరకు తిట్టుకున్న మాటలు అన్నీ ఎవరికీ కనిపించకుండా, ఎక్కడా ఆధారాలు లేకుండా చేసుకుంటారు.

తెలుగునాట రెండు చానెళ్ల వ్యవహారమే ఇది. ఎవరు ఎందుకు ప్రారంభించారో? ఎవరు ముందుగా ప్రారంభించారో తెలియదు కానీ, మొత్తానికి రెండు చానెళ్ల మధ్య యుద్దం ప్రారంభమైంది. 'మీ పదవి అడ్డం పెట్టుకుని, బినామీ పేర్లతో జూబ్లీ హిల్స్ లో భయంకరంగా స్థలాలు కాజేసారని ఒకరు', 'మీరు దందాలు చేసి, పటాన్ చెరువు, ఆ చుట్టుపక్కల రియల్ దందాలు చేసారని మరొరు' ఒకరి మీద మరొకరు బురద జల్లుకున్నారు.

అసలు ఆ మాటకు వస్తే జూబ్లీ హిల్స్ స్థలాల విషయంలో ఆ సొసైటీ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై గట్టి విచారణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టాలని ఓ డిమాండ్ వినిపించింది. అలాగే ఓ ఛానెల్ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ఇంకో డిమాండ్ వినిపించింది. ఇవన్నీ సోషల్ మీడియాలోనే.

ఇంతలో ఓ సామాజిక వర్గం ఎక్కువగా వుంటే ఓ అయిదు అక్షరాల గ్రూపులో, ఏమిటి మనవాళ్లు ఇద్దరూ ఇలా కొట్టుకోవడం అనే ప్రశ్నలు కనిపించడం ప్రారంభించాయి. మరి ఉత్తరోత్తరా ఏమయిందో కానీ, సాయంత్రం కాకుండా, రెండు చానెళ్లు సైలంట్ అయిపోయాయి. యూ ట్యూబ్ లో పెట్టిన విడియోలు ప్రయివేట్ అయిపోయాయి. తయారు చేసిన ప్లే కార్డ్ లు మాయం అయిపోయాయి. గొడవ మొత్తం ప్రోమోలతో పోయింది.

కానీ ఎవరైనా ఈ రెండు రకాల ప్రోమోలు తీసుకుని, అసలు వైనాలు అన్నీ బయటకు లాగగలిగితే బాగానే వుంటుంది. కానీ ఎవరి వ్యవహారాలు వారివి, ఇప్పుడు ఎవరన్నా పూనుకుంటే ముందు వాళ్లపై ఆ రెండు చానెళ్లలో బురద జల్లుడు ప్రారంభం అవుతుంది. అందుకే ఎవ్వరూ పట్టించుకోరు. అదే వాళ్ల ధీమా కూడా.

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?