కోర్టు తీర్పులపై ఆర్కే కామెంట్ ?

కోర్టు తీర్పులను ఎవ్వరూ కామెంట్ చేయరాదు. అలాగే ప్రభావితం చేయరాదు. ఇది ప్రాధమిక సూత్రం. ఓ పత్రిక సంపాదకుడిగా ఈ విషయం ఏబిఎన్ ఆర్కే కు తెలియదు అని అనుకోవడానికి లేదు. కానీ ఆయన…

కోర్టు తీర్పులను ఎవ్వరూ కామెంట్ చేయరాదు. అలాగే ప్రభావితం చేయరాదు. ఇది ప్రాధమిక సూత్రం. ఓ పత్రిక సంపాదకుడిగా ఈ విషయం ఏబిఎన్ ఆర్కే కు తెలియదు అని అనుకోవడానికి లేదు. కానీ ఆయన రాస్తున్న రాతలు మాత్రం వేరుగా వుంటున్నాయి..

''…భారతీయ జనతా పార్టీ పెద్దలు తమిళనాడు ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌లో కూడా అమలుచేసే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. తమను ధిక్కరించిన శశికళను అధికారానికి దూరం చేయడం కోసం అవినీతి కేసులలో శిక్ష వేయించి జైలుకు పంపిన బీజేపీ పెద్దలు భవిష్యత్తులో జగన్మోహన్‌రెడ్డి విషయంలో కూడా అదే తరహా ప్రయోగం చేయబోరన్న గ్యారంటీ ఏమీ లేదు….''

ఇదీ ఆర్కే రాసినది

శశికళను అధికారానికి దూరం చేయడం కోసం, అవినీతి కేసుల్లో శిక్ష వేయించి జైలుకు పంపించారట భాజపా పెద్దలు. 

అంటే భాజపా పెద్దలు అనుకుంటే కేసులు పడతాయన్నమాట. సరే, కేసులు పడతాయి అనుకుందాం. కానీ కేసులు పడినంత మాత్రాన న్యాయమూర్తులు శిక్ష వేసేస్తారా? విచారణ జరిపి, తగిన సాక్ష్యాధారాలు వుంటే కదా? శిక్ష వేసేది. శశికళ కేసులో కూడా అదే జరిగి వుంటుంది కదా? మరి ఆర్కే ఈ క్రెడిట్ లేదా ఈ కార్యక్రమం మొత్తం భాజపాదే అంటారు? అలా అనడం అంటే ఆ కేసులో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును శంకించడం కిందకు వస్తుందా? రాదా? ఈ విషయం లాయర్లే చెప్పాలి. ఈ విషయం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లి, నిజం రాబట్టాలి. 

ఇక ఇంకో విషయం ఏమిటంటే, ఇదే తరహా ప్రయోగం ఆంధ్రలో కూడా చేస్తారట. ఎలా?  జగన్ మీద ఇప్పటికే కేసలు వున్నాయి. అందువల్ల ఆ విషయంలో భాజపాకు ఇక శ్రమలేదు. శిక్ష పడాలి అంటే కోర్టులో నేరం రుజువు కావాలి. న్యాయమూర్తి తీర్పు ఇవ్వాలి. 

కానీ ఆర్కే ఇలా జరిగే అవకాశం వుంది అని ముందే చెప్పేస్తున్నారే? అంటే ఇది తీర్పును ప్రభావితం చేయడం కిందకు రాదా? ఈ విషయం కూడా న్యాయ నిపుణులే చెప్పాలి. లేదా ఎవరైనా కోర్టుకు వెళ్లి నిజం రాబట్టాలి. ఎందుకంటే కేసు విచారణలో వుండగా, శిక్ష పడుతుంది. భాజపా వాళ్లు శిక్షపడేలా చేస్తారు? అని అనడం అంటే  ఏమేరకు సబబు అనుకోవాలి. 

ఆర్కే లాంటి సంపాదకులు తమకు నచ్చని విషయాలు, లేదా నచ్చని వ్యక్తుల మీద వ్యాసాలు రాసుకోవచ్చు. అవి వారి అభిరుచిని, అభిప్రాయాన్ని తెలియ చేస్తాయి. కానీ అలా రాయడంలో కాస్త సంయమనం పాటించాల్సిన అవసరం అయితే వుంది. మరీ అక్కసు వెళ్లగక్కినట్లు వుండకూడదు.

చంద్రబాబూ నీకు ఎవడిచ్చాడు హక్కు