Advertisement

Advertisement


Home > Politics - Gossip

కేసీఆర్ పుండు మీద డీఎస్ కారం!

కేసీఆర్ పుండు మీద డీఎస్ కారం!

గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంతో అంటీముట్టనట్టుగానే ఉన్నారు డీఎస్. ఈయన ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి చేతిలో ఓడిపోయినా.. పిలిచి పదవిని ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన డీఎస్ కు రాజ్యసభ అవకాశం ఇచ్చారు కేసీఆర్. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిలో పొందలేకపోయారాయన. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారనే వార్తల్లో నిలిచారు డీఎస్. ఢిల్లీలో సంప్రదింపులు పూర్తయ్యాయని.. డీఎస్ కాంగ్రెస్ లోకి చేరిపోతారని వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో అవి నిజం కాలేదు.

అయినా కూడా డీఎస్ కు, కేసీఆర్ కు దూరం మాత్రం అలాగే కొనసాగుతున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతూ వచ్చారు. అంతే అనుకుంటే ఇటీవలే డీఎస్ తనయుడి నుంచి కేసీఆర్ కు తిరుగులేని షాక్ తగిలింది. బీజేపీ తరఫున డీఎస్ తనయుడు పోటీ చేసి కేసీఆర్ కూతురు మీద ఎంపీగా నెగ్గారు.

ఇలా డీఎస్ వైపు నుంచి కేసీఆర్ అండ్ కో కి షాకులు తగిలాయి. ఈ పరంపరలో తాజాగా తన తనయుడి అభినందన సభకు హాజరయి కేసీఆర్ కు మరో సవాల్ విసిరారు డీఎస్. బీజేపీ తరఫున నెగ్గిన ధర్మపురి అరవింద్ అభినందన సభకు డీఎస్ హాజయ్యారు. తనయుడిని అభినందించడమే గాక.. మున్నూరు కాపులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నట్టుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో డీఎస్ కూడా బీజేపీలోకి చేరబోతున్నాడనే వార్తలూ వస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?