cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్

దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయ్

సర్వసంగ పరిత్యాగులం. సన్యాసులం అని చెప్పుకునే వారు మెర్సీడీస్ ల్లో తిరుగుతున్నారు. ఏసిల్లో తప్ప వుండడం లేదు. వంటి నిండా నగలు దిగేసుకుంటున్నారు. వీళ్లను చూసి నవ్వుకునే జనమే, జగన్ కు డబ్బు యావ తగ్గలేదు. డబ్బు కోసం జగన్ వెంపర్లాడడాన్ని జబ్బు అంటారు. అనే రాతలు చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. 

''....మంచో చెడో తండ్రి హయాంలో సంపాదించిన డబ్బుతో జగన్మోహనరెడ్డి సంతృప్తి చెందడం లేదు.ఇంకా ఇంకా ఆరాటపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక రకంగా మానసిక జాఢ్యం...''

ఇలా రాయడం అంటే ఏమనుకోవాలి? గత రెండేళ్లకు పైగా జగన్ పాలనలో అప్పులు చేసి పంచుతున్నారు అన్న అపప్రధ తప్ప, అవినీతి మరక పడలేదు. అది అందరికీ తెలుసు. మద్యం ఆదాయం అయినా అది ప్రభుత్వానికి వెళ్తుంది కానీ జగన్ జేబులోకి కాదు. ఇప్పుడు సినిమా ఆన్ లైన్ టికెటింగ్ అయినా అంతే. 

ఆ మాట అలా వుంచితే డబ్బు యావ లేని వారు ఎవరు?  ఏ డబ్బు యావ లేకుండానే 80 లు దాటినా, వేల కోట్లు సంపాదించినా ఇంకా ఏదో ఒక వ్యాపారం చేస్తూనే వున్నారుగా. పోనీ అవయినా నిజాయతీగా చేస్తున్నారా? రకరకాల దోపిడీ పద్దతలు అమలు చేస్తున్నారు కదా. ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వకుండా తిప్పలు పెడుతున్నారు కదా?

ఎవరికి తోచిన మేరకు బ్యాంకులకు వేల కోట్ల రుణాల ఎందుకు ఎగ్గొడుతున్నారు? పైగా అలా ఎగ్గొట్టేసి ఆ కంపెనీలకు రాజీనామా చేసి, తమకు సంబంధం లేదని బుకాయింపులు.  జనాల సంపాదన తమ దగ్గర దాచుకుంటే, వాటిని తాకట్టు పెట్టేసి బిచాణా ఎందుకు ఎత్తేసారు కొందరు.  

ఇలా అనేక మార్గాల వేలకోట్లు సంపాదించిన వారంతా ఇప్పుడు జగన్ కు ధనదాహం అనే తప్పుడు ప్రచారం స్టార్ట్ చేసారా? ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం కాదూ?

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి