ప్ర‌కాశ్‌రాజ్ టార్గెట్‌… బండ్ల వీడియో వైర‌ల్‌!

ఈ ద‌ఫా ప్ర‌కాశ్‌రాజ్ వంతు వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌కాశ్‌రాజ్‌ను భుజాన మోసిన బండ్ల గ‌ణేశ్ …తాజాగా వ్యూహం మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌కాశ్‌రాజ్ పేరు ఎత్త‌కుండానే, ఆయ‌న చ‌ర్య‌ల‌ను బండ్ల గ‌ణేశ్ ప‌రోక్షంగా…

ఈ ద‌ఫా ప్ర‌కాశ్‌రాజ్ వంతు వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ప్ర‌కాశ్‌రాజ్‌ను భుజాన మోసిన బండ్ల గ‌ణేశ్ …తాజాగా వ్యూహం మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌కాశ్‌రాజ్ పేరు ఎత్త‌కుండానే, ఆయ‌న చ‌ర్య‌ల‌ను బండ్ల గ‌ణేశ్ ప‌రోక్షంగా త‌ప్పు ప‌ట్ట‌డం ‘మా’ఎన్నిక‌ల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్పొచ్చు. బండ్ల తాజా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

త‌న ప్యాన‌ల్ నుంచి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి జీవితా రాజ‌శేఖ‌ర్ పోటీ చేస్తార‌ని ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌క‌టించ‌డం, ఆ త‌ర్వాత బండ్ల గ‌ణేశ్ విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిందే. కానీ ప్ర‌కాశ్‌రాజ్‌ను మాత్రం ఆయ‌న వెన‌కేసుకొచ్చారు. ఇప్పుడేమైందో తెలియ‌దు కానీ, ప్ర‌కాశ్ రాజ్‌ను బండ్ల టార్గెట్ చేశార‌ని, ఇందుకు ట్విట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన వీడియోనే నిద‌ర్శ‌న‌మ‌ని టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎన్నికల ప్రచారం పేరుతో కళాకారులందర్నీ ఒకచోటకు చేర్చి వారి జీవితాలతో చెలగాటాలాడొద్దని బండ్ల గణేశ్ హిత‌వు ప‌లికారు. నేడు (ఆదివారం) హైద‌రాబాద్‌లో ప్ర‌కాశ్‌రాజ్ ‘కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం’ అనే పేరుతో విందు ఏర్పాటు చేసిన నేప‌థ్యంలో బండ్ల గ‌ణేశ్ వీడియో విడుద‌ల చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఆ వీడియోలో గ‌ణేశ్ ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘విందులు, సన్మానాలు, పార్టీల పేరుతో ‘మా’కళాకారులందర్నీ దయచేసి ఒకదగ్గరికి చేర్చకండి. గత రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ కరోనా భయంతోనే బతుకుతున్నారు. మీకు ఓటు కావాలనుకుంటే ఫోన్‌ చేసి మీరు చేయాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్లకు చెప్పండి.  వాళ్ల జీవితాలతో చెలగాటాలాడొద్దు. నా లాంటి వాళ్లు చావు అంచుల వ‌ర‌కూ వెళ్లి వ‌చ్చాం. అందువ‌ల్లే అంద‌రికీ ఇదే నా విన్నపం’ అని బండ్ల గణేశ్ త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు.

అస‌లు బండ్ల గ‌ణేశ్ మన‌సులో ఏముందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. నిన్న న‌రేశ్‌కు హిత‌వు చెప్పిన సంగ‌తి తెలిసిందే. నేడు ప్ర‌కాశ్‌రాజ్‌. ఇలా రోజుకొక‌రు చెప్పిన టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తే… ఒన‌గూరే లాభం ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌క‌మైంది. మొత్తానికి ప్ర‌కాశ్‌రాజ్ విందు ఏర్పాటు చేయ‌డాన్ని బండ్ల గ‌ణేశ్ ప‌రోక్షంగా త‌ప్పు ప‌డుతూ వీడియో సందేశాన్ని వినిపించ‌డం గ‌మ‌నార్హం.