ప్ర‌కాశ్‌రాజ్ దూకుడు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో అధ్య‌క్ష బ‌రిలో నిల‌వ‌నున్న ప్ర‌కాశ్‌రాజ్ దూకుడు పెంచారు. ఇటీవ‌ల త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌కాశ్‌రాజ్‌, త‌న‌దైన టీంతో ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయ‌న…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో అధ్య‌క్ష బ‌రిలో నిల‌వ‌నున్న ప్ర‌కాశ్‌రాజ్ దూకుడు పెంచారు. ఇటీవ‌ల త‌న ప్యాన‌ల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌కాశ్‌రాజ్‌, త‌న‌దైన టీంతో ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా ఆయ‌న ఆదివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఓ ప్ర‌ముఖ ఫంక్ష‌న్ హాల్లో విందు ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం.

సృజ‌నాత్మ‌క‌త‌కు ప్ర‌కాశ్‌రాజ్ పెట్టింది పేరు. విందు ఆహ్వానాన్ని కూడా త‌న‌దైన రీతిలో ‘మా’ స‌భ్యుల‌కు పంపారు. ‘కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం’ అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని స‌భ్యుల‌కు ఆయ‌న త‌ర‌పున పంపిన‌ట్టు టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు ప్యాన‌ల్‌లో పోటీదారుల‌పై చిన్న‌చిన్న అసంతృప్తుల‌పై చ‌ర్చించి స‌ద్దుమ‌ణిగేలా చేసుకున్నార‌ని స‌మాచారం.

ఇటీవ‌ల ప్ర‌స్తుత ‘మా’ అధ్య‌క్షుడు న‌రేశ్ కూడా విందు ఏర్పాటు చేశారు. ఇదిలా వుండ‌గా ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ప్ర‌చారంలో వున్న మంచు విష్ణు వ్యూహం ఏంట‌నేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. చాప‌కింద నీరులా ‘మా’ ఎన్నిక‌ల‌కు ఆయ‌న స‌మాయ‌త్తం అవుతున్నార‌ని స‌మాచారం. టాలీవుడ్‌లో పాతుకుపోయిన ఓ సామాజిక వ‌ర్గం అండ మంచు విష్ణుకు బ‌లంగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

ఏది ఏమైనా వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్‌రాజ్‌, మంచు విష్ణు మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండే అవ‌కాశాలు న్నాయి. విందుకు హాజ‌ర‌య్యే వాళ్ల‌ను బ‌ట్టి త‌మ బ‌లాన్ని అంచ‌నా వేసుకునే ఎత్తుగ‌డ‌లో అభ్య‌ర్థులున్నారు.