Advertisement

Advertisement


Home > Politics - Gossip

ధర్మానకు పదవి అందుకే అందలేదా?

ధర్మానకు పదవి అందుకే అందలేదా?

శ్రీకాకుళం జిల్లా నుంచి మంత్రిగా ఎవరు వుంటారు? అన్న విషయంలో అన్ని మీడియాలదీ ఒకటే స్పెక్యులేషన్. ధర్మాన ప్రసాదరావుది ఫస్ట్ ప్లేస్. ఆయన సోదరుడు కృష్ణదాస్ ది రెండో ప్లేస్. కానీ మంత్రిపదవి ధర్మానకు దక్కలేదని, తమ్ముడినే వరించిందని వార్తలు వినవస్తున్నాయి. దీనికి రకరకాల కారణాలు వినిపించడం అప్పుడే ప్రారంభమైంది.

శ్రీకాకుళం నుంచి వైకాపా తరపున ఎంపీగా పోటీచేసిన దువ్వాడ శ్రీనివాస్ తక్కువ తేడాతో ఓడిపోవడం వెనుక ధర్మాన హస్తం వుందన్న అనుమానాలు వైకాపా పార్టీలో వున్నట్లు తెలుస్తోంది. ధర్మాన సామాజిక వర్గం, తేదేపా అభ్యర్థి రామ్మోహన నాయుడు సామాజిక వర్గం ఒక్కటే. వెలమలు. కానీ దువ్వాడ శ్రీనివాస్ కాళింగ.

అందుకే ధర్మాన నియోజకవర్గంలో, ఆయన ప్రభావం వున్న చోట్ల భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని వైకాపా అధిష్టానానికి నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రెవెన్యూ భూముల వ్యవహారాల్లో, మైనింగ్ వ్యవహారాల్లో గతంలో ధర్మాన ప్రసాదరావుపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. విచారణలు జరిగాయి. వీటిని కూడా జగన్ దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు

సినిమా రివ్యూ: హిప్పీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?