Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నితిన్ కోసం మళ్లీ పిసి శ్రీరాం

నితిన్ కోసం మళ్లీ పిసి శ్రీరాం

హీరో నితిన్ కెరీర్ లో ఇష్క్ సినిమా ఎలాంటి మలుపు అన్నది తెలిసిందే. విక్రమ్ కే కుమార్ - ఆయన ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ కలిసి నితిన్ కు మాంచి కలర్ పుల్ విజయం అందించారు. ప్రస్తుతం డౌన్ లో వున్న నితిన్ ను అదృష్టం తలుపు తట్టింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రెడీ అవుతున్నాయి.

దాంట్లో వెంకీ కుడుమల సినిమా ఈనెల 20న ప్రారంభం అవుతోంది. వెంకీ అట్లూరితో చేసే రెండో సినిమాకు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ గా ఫిక్స్ అయ్యారు. వెంకీ కుడుమల భీష్మ సినిమాకు దాదాపుగా ఛలో టీమ్ పనిచేస్తుంది. వెంకీ అట్లూరి సినిమాకు మాత్రం అంతా ఫ్రెష్ టీమ్ పని చేస్తుందని తెలుస్తోంది. సంగీతం కూడా డిఫరెంట్ గా వుండేలా ఎవరినో ఫిక్స్ చేయబోతున్నారని బోగట్టా.

రెండు సినిమాల్లో ఇద్దరు క్రేజీ హీరోయిన్లు రష్మిక, కీర్తిసురేష్ సెట్ అయ్యారు. చూస్తుంటే మాంచి కాంబినేషన్లు అన్నీకలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. 

6 నెలలు కాదు.. 6 రోజుల్లోనే దూకుడు

సినిమా రివ్యూ: హిప్పీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?