Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆ విషయంలో చిరంజీవి కంటే.. పవనే గొప్ప

ఆ విషయంలో చిరంజీవి కంటే.. పవనే గొప్ప

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు.. మిగతావాళ్ల సంగతేమో కానీ సినీ జనాల్లో చాలామందికి ఈ వ్యవహారంలో అందెవేసిన చేయి. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం వీరికి ఆనవాయితీ. నువ్వు పడగొట్టాలని చూస్తే, నేను నిలబెడతా.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంపశయ్యపై ఉన్నప్పుడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేసి జగన్ ని ఉద్దేశిస్తూ అన్న డైలాగులివి. కానీ ఓడలు బండ్లయ్యాయి, బండ్లు ఓడలయ్యాయి. ఇప్పుడు చిరంజీవి స్వయంగా సీఎం జగన్ ఇంటికెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలసి వెళ్లారు.

ఎల్లకాలం ఎవరూ ఎవరికీ శత్రువులుగా ఉండరు అనుకుందాం. మరి సడన్ గా చిరంజీవికి ఇప్పుడే జగన్ ఎందుకు గుర్తొచ్చారు. జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ కనీసం పలకరింపు కూడా లేదు కదా, నాలుగు నెలల తర్వాత ఇప్పుడీ భేటీ ఎందుకు? ఇది కూడా కమర్షియల్ లెక్కల్లో భాగమే. కేవలం తన సినిమా ప్రమోషన్, రాయితీల కోసమే చిరంజీవి జగన్ ని కలిశారనేది సుస్పష్టం.

ఇక పవన్ కల్యాణ్ విషయానికొద్దాం. పవన్ కూడా సినీ వాసన ఉన్న రాజకీయ నాయకుడే. ప్రజారాజ్యం సంగతి పక్కనపెడితే, సొంతగా జనసేన పెట్టుకున్నప్పటి నుంచీ పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీ సింపతైజర్ అని అందరికీ తెలుసు. ఓ ఎన్నికల్లో బహిరంగ పొత్తులు పెట్టుకున్నా, మరో ఎన్నికల నాటికి రహస్య అజెండాతో పనిచేసినా.. ఎప్పుడూ టీడీపీకే ఫేవర్ చేశారు పవన్, ఇంకా చేస్తున్నారు కూడా. ప్యాకేజీ అన్నా, లాలూచీ అన్నా.. ఆ విషయంలో పవన్ నిజాయితీతోనే ఉన్నారు కానీ, అధికార మార్పిడి జరిగాక ఆ గట్టు నుంచి, ఈ గట్టుకి దూకాలనుకోలేదు.

వైఎస్ జగన్ పై పవన్ ఇంకా వ్యతిరేక వైఖరితోనే ఉన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా తన స్టాండ్ మార్చుకోలేదు. అధికారంలో ఉన్న వారి ప్రాపకానికి పాకులాడలేదు. ఏదో తన తంటాలు తాను పడుతున్నారు కానీ ఎప్పుడూ జగన్ ని కలవాలనుకోలేదు, అధికార పార్టీతో అంటకాగాలనే ఆలోచనా పవన్ లో లేదు. అన్న, తమ్ముడు.. ఇద్దరిలో ఎంత వైరుధ్యం. సొంతలాభం కోసం చిరంజీవి సీఎంను కలిశారు, అధికారంలో లేకపోయినా కూడా పవన్ తన వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. 

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?