cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

అన్నయ్యా ఏం చేద్దాం..?? ఊరుకో తమ్ముడూ..!

అన్నయ్యా ఏం చేద్దాం..?? ఊరుకో తమ్ముడూ..!

సీఎం జగన్ జనసేనానికి గట్టి కౌంటర్ ఇచ్చి48గంటలు కావస్తోంది. జగన్, పవన్ గురించి మాట్లాడింది జస్ట్ 30సెకన్లే అయినా.. పవన్ దానికి ఎంత గింజుకున్నారో అందరికీ తెలుసు. మీ పిల్లలు ఎక్కడ, ఏ మీడియం చదువుతున్నారయ్యా అని జగన్ ప్రశ్నిస్తే, తన పెళ్లిళ్ల గురించి ప్రపంచానికి తెలియని నిజాన్ని ఏదో జగన్ బయటపెట్టినట్టు ఇదైపోతున్నారు పవన్. ఇదే సమయంలో పవన్ ని బాగా అభిమానించే అన్నయ్య నాగబాబు కూడా మనసు కష్టపెట్టుకున్నారట.

గతంలో రామ్ గోపాల్ వర్మ, బాలకృష్ణకు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా గట్టి కౌంటర్లు ఇచ్చిన నాగబాబు, జగన్ విషయంలో మాత్రం అంత త్వరగా స్పందించ లేదు, అసలు స్పందిస్తారో లేదో కూడా తెలియదు. తమ్ముడికి వకాల్తా పుచ్చుకుంటూ ప్రెస్ మీట్ పెట్టక పోయినా కనీసం తన యూట్యూబ్ ఛానెల్ లో అయినా స్పందిస్తారని ఆశించారు మెగాభిమానులు.

పైగా నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్లో మైఛానెల్ నాఇష్టంలో యాక్టివ్ గానే ఉన్నారు. జార్జిరెడ్డి సినిమాని ప్రశంసిస్తూ లేటెస్ట్ గా ఓ వీడియో వదిలారు. మరి పవన్ సంగతి ఏం చేశారు. తమ్ముడిపై ఈగ వాలినా ఊరుకోనంటూ రెచ్చిపోయే నాగబాబు కిమ్మనకుండా ఉన్నారెందుకు.

ఇక్కడ కూడా చిరంజీవి నాగబాబుకి అడ్డుతగిలినట్టు తెలుస్తోంది. పవన్ పై జగన్ కామెంట్ల అనంతరం మెగా ఫ్యామిలీలో పెద్ద చర్చే జరిగినట్టు సమాచారం. చిరంజీవి వద్దు వద్దంటుండే సరికి చర్చ కాస్తా రచ్చగా మారింది. పైనల్ గా చిరు కాస్త గట్టిగానే నాగబాబుకి చెప్పేశారట.

"ఇది వైసీపీ-జనసేన మధ్య జరుగుతున్న మాటల యుద్ధం. జగన్ కీ మెగా ఫ్యామిలీకి మధ్య కాదు. కేవలం రాజకీయాల్ని రాజకీయాలుగానే చూడాలి కానీ, వ్యక్తిగతంగా చూడొద్దు, స్పందించొద్దు" అని తన నిర్ణయాన్ని చెప్పారట చిరంజీవి.

అందుకే నాగబాబు సైలెంట్ గా ఉన్నారని సమాచారం. ఓడిపోయినా తన నియోజకవర్గానికి వస్తూపోతుంటాను, ప్రజల కోసం రాజకీయాలు చేస్తానంటూ కబుర్లు చెప్పిన నాగబాబు, ఇటీవల పూర్తిగా రాజకీయాలు మాట్లాడ్డం మానేశారు, పవన్ పోరాటాలు, ప్రెస్ మీట్లలో కూడా కనిపించడం లేదు.

ఇలాంటి టైమ్ లో తమ్ముడిపై కౌంటర్లు పడిన తర్వాత బైటకొస్తే, తనని కూడా జనం ప్రశ్నిస్తారని నాగబాబు వెనక్కి తగ్గారట.