పంచనామాతో పండగ చేసుకుంటే ముప్పే!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయనవద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ చేతివాటం విషయంలో పచ్చదళాలు ఇప్పుడు  పండగ చేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల పాటూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన…

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. ఆయనవద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ చేతివాటం విషయంలో పచ్చదళాలు ఇప్పుడు  పండగ చేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల పాటూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన తర్వాత.. ప్రాథమికంగా.. ఒక పత్రికా  ప్రకటన విడుదల చేశారు. తాజాగా శ్రీనివాస్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న వాటి వివరాలతో పంచనామా నివేదిక కూడా విడుదల చేశారు. ఇప్పుడు తెలుగుదేశం దళాలన్నీ పండగ చేసుకుంటున్నాయి. కేవలం 2 లక్షల పైచిలుకు నగదు, బంగారం మాత్రమే దొరికినట్లుగా నివేదికలో ఉందని, వాటికి కూడా పద్ధతిగా లెక్కలు చెప్పేసరికి తిరిగి ఇచ్చేశారని తెదేపా వారంతా పదేపదే తమ గళం వినిపిస్తున్నారు. అయితే ఇక్కడ వారు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటుంది.. ‘ఇల్లలకగానే పండగ కాదు’!

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఒక్కడి మీదనే ఐటీ దాడులు జరగలేదు. కొన్ని సంస్థల మీద జరిగిన దాడుల్లో భాగంగానే ఆయన ఇళ్ల మీద కూడా జరిగింది. అవన్నీ ఇన్‌ఫ్రా కంపెనీలు.. భారీ మతలబుల అనుమానం వచ్చేసరికి ఐటీ వారితో ఈడీ అధికారులు కూడా ఏకకాలంలో వచ్చి సోదాలు నిర్వహించారు. ఒక పత్రికా ప్రకటన కూడా రావడంతో.. తెలుగుదేశం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. బినామీ కంపెనీలు ముసుగులో భారీ స్వాహాలు ఉన్నట్లుగా లెక్క తేలడంతో కంగారు పడ్డారు.

కానీ వారు ఊరటగా భ్రమించేలా.. శ్రీనివాస్ ఇంట్లో సోదాల పంచనామా రిపోర్టు వచ్చింది. నగదు, బంగారం గుర్తించిన వాటి లెక్కలు చెప్పి, వాటిని తిరిగి ఇచ్చినట్లుగా కూడా అందులో పేర్కొన్నారు. దాంతో.. శ్రీనివాస్  పరిశుద్ధాత్మ స్వరూపుడు అన్నట్లుగా తెలుగుదేశం వాళ్లు టముకు వేయడం ప్రారంభించారు.

అయితే విశ్లేషకులు మాత్రం ఇల్లలకగానే పండగ కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పంచనామా రపోర్టు నగదు, బంగారం విలువల్ని వెల్లడించవచ్చు గాక.. కానీ.. శ్రీనివాస్ సోదాలకు అనుబంధంగా సాగించిన సోదాలన్నింటితో ఆయనకు ప్రమేయం ఉంటే.. మొత్తం లెక్క తేలడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుంది. నగదు, బంగారంతో ఆగే వ్యవహారం కాదిది. ఆయా సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఆషామాషీవి కాదు.

ఆ కంపెనీలు పొందిన లబ్ధిపై, బినామీ కంపెనీల ముసుగులో ఎవరెవరికి ఏం అందింది.. అనే విషయాలపై పూర్తి వివరాలు వెల్లడయ్యాక గానీ.. ఎవరి స్వచ్ఛతనూ ధృవీకరించడానికి వీల్లేదు. ఇప్పటినుంచే మితిమీరి పండగ చేసుకుంటే.. ముందు ముందు వారు నాలుక కరచుకోవాల్సివస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి