3 రోజులకే బోల్తాకొట్టిన ఫేమస్ లవర్

సరిగ్గా 3 రోజులు తిరిగేసరికి ఫ్లాప్ అయిపోయింది వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై క్రిటిక్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్…

సరిగ్గా 3 రోజులు తిరిగేసరికి ఫ్లాప్ అయిపోయింది వరల్డ్ ఫేమస్ లవర్. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై క్రిటిక్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ కూడా తోడవ్వడంతో రెండో రోజు నుంచే వరల్డ్ ఫేమస్ లవర్ చతికిలపడిపోయాడు.

నిన్నటితో మొదటి వారాంతం పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పోల్చి చూసుకుంటే ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం. వరల్డ్ వైడ్ ఈ సినిమాను 31 కోట్ల రూపాయలకు అమ్మారు. తాజా వసూళ్లతో కంపేర్ చేస్తే.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కనీసం మరో 10 రోజుల పాటు హౌజ్ ఫుల్స్ నడవాలి.

కానీ రిలీజైన రెండో రోజు నుంచే విజయ్ దేవరకొండ సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది. వీకెండ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమా వైపు చూడలేదు. మరోసారి అల వైకుంఠపురములో చూడ్డానికి ఇష్టపడ్డారు కానీ, ఈ ఫేమస్ లవర్ ను మాత్రం పట్టించుకోలేదు. అలా విజయ్ దేవరకొండ తన కెరీర్ లో వరుసగా మరో ఫ్లాప్ అందుకున్నాడు.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ నటించిన ఫ్లాప్ సినిమా నోటా కంటే తక్కువగా ఈ సినిమాకు యూఎస్ లో వసూళ్లు వస్తున్నాయి. విషయం పూర్తిగా అర్థమవ్వడంతో.. యూనిట్ సైలెంట్ అయింది. రిలీజ్ తర్వాత చేద్దామనుకున్న హంగామా మొత్తాన్ని పక్కనపెట్టేసింది.

త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చాలా పెద్దది