'న్యాయాన్ని ధర్మాన్ని కాపాడ్డానికి నువ్వు వస్తున్నావనగానే విజిల్స్ వేయడానికి నేనేం నీ ఫ్యాన్ ను కాదురా'
ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి డైరక్టర్ దగ్గర నుంచి ఇలాంటి మాస్ పవర్ ఫుల్ డైలాగ్ వస్తుందని ఎవ్వరూ అనుకోరు. సినిమా సినిమాకు ఓ జోనర్ మారుస్తూ, అందులోనే తన క్లాస్ టేకింగ్ ను మిక్స్ చేస్తూ తన స్టయిల్ చూపిస్తూ వస్తున్నారు మోహనకృష్ణ. గతంలో జెంటిల్ మన్ లాంటి డిఫరెంట్ ప్రయత్నం నానితో చేసి, మళ్లీ ఈసారి పూర్తిగా నానితో ఓ థ్రిల్లర్ ను తీస్తున్నారు. సుధీర్ బాబు మరో హీరో.
ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. పోలీస్ ఆఫీసర్ కు, మర్డర్లు చేసే సైకోకు మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ ను టీజర్ లో టచ్ చేసారు. సరే, నాని ఎలాగూ హీరో కాబట్టి, ఆ మర్డర్లకు ఎలాగూ లాజికల్ మోటో చూపిస్తారు. అది వేరే సంగతి. టీజర్ వరకు రెండు పవర్ ఫుల్ డైలాగులు నానితో చెప్పించారు. ఓ డైలాగ్ సుధీర్ బాబుకు ఇచ్చారు. మాంచి యాక్షన్ సీక్వెన్స్ లు జోడించారు.
ఆ విధంగా ఇటు డైలాగ్ పార్ట్, అటు యాక్షన్ పార్ట్ రెండూ బాగానే డీల్ చేసినట్లు దర్శకుడు చెప్పకనే చెప్పారు. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ నిర్మించే ఈ సినిమా మార్చి 25న విడుదలవుతుంది.