ఎదుటిమనిషికి చెప్పేటందుకే నీతులు

తన అధికారానికి ఎదురు ఉండకూడదన్న ఆలోచనతో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనం చేస్తూ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం Advertisement పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా…

తన అధికారానికి ఎదురు ఉండకూడదన్న ఆలోచనతో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీని బలహీనం చేస్తూ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం

పార్టీలో ప్రజాస్వామ్యాన్ని మచ్చుకు కూడా కనిపించకుండా చేసిన ఆయన అంతా తానే అన్నట్టుగా వ్యవహారాలు నడిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంతంగా ఆలోచించడం ఆపేశారు. ఎన్నికలంటే మా సారే చూసుకుంటారన్న భావన వారిలో ఏర్పడింది. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉండటాన్ని కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు

క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మీడియాను, అధికార యంత్రాంగాన్ని భయపెట్టి లొంగదీసుకుని అనుకూల ప్రచారం పొందడానికి అలవాటుపడ్డారు

మంత్రులు, శాసనసభ్యులు, ఇతర నాయకులు తమ ఇలాకాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మొదలెట్టారు.

సంక్షేమ ఫలాలు అందుకుంటున్న ప్రజలు తన పార్టీకి విధేయులుగా ఉండకపోతారా? అని మితిమీరిన విశ్వాసాన్ని ఏర్పరచుకున్నారు. యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో విఫలమయ్యారు. ప్రధాన మీడియాను అదుపు చేయగలిగినా సోషల్‌ మీడియాలో వ్యతిరేక ప్రచారాన్ని యువత ముమ్మరం చేసింది

దర్జా లైఫ్‌కు అలవాటు పడితే కామన్‌మ్యాన్‌ దూరం అవుతాడని తెలుసుకోవాలి. ప్రజల్లో పట్టు లేనివారిని వెంటబెట్టుకుని వారినే ప్రోత్సహిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు అదే జరిగింది.

ఈ సుద్దులు, హిత వాక్యాలకు పేటెంట్ హక్కు ఎవరిదీ కాదు. ఘనత వహించిన జర్నలిస్ట్ కమ్ కాలమిస్ట్ ఆర్కే గారిది. ఆయన వారం వారం ఇచ్చే ప్రవచనాల కార్యక్రమంలో భాగంగా ఈవారం అందించిన వ్యాసం లోనివి. జస్ట్, ఆ వ్యాసంలోంచి అలా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసామంతే.

ఆయన రాసింది తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అది కూడా హైదరాబాద్ నగర ఎన్నికల్లో ఒరిగిన పరాభవం నేపథ్యంలో. ఈ వాక్యాలు అన్నీ చదువుతుంటే  రెండు విషయాలు ప్రస్తావనకు తేవాలని అనిపిస్తోంది. 

మొదటి విషయం…తిట్లు కూడా సుతిమెత్తగా చెప్పడం ఓ పద్దతి. మంచి విషయాన్ని కూడా పుల్ల విరిచినట్లు చెప్పడం ఇంకో పద్దతి. ఇదే కనుక ఆంధ్రలో స్థానిక ఎన్నికల్లో జగన్ వైకాపా పార్టీ పరాజయం చెందితే ఇదే వ్యాసం ఇదే తరహా పదజాలంతో వుంటుందా? ఎంత ఘాటైన పదాలు జాలువారతాయి. 'తగిన శాస్తి జరిగింది..విర్రవీగితే..జనం కీలెరిగి వాత పెట్టారు..''ఇలాంటి అనేకానే పరుషపదజాలం అంతా వ్యాసం నిండా పరుచుకునేది. 

ఇక రెండో విషయం. ఈ వాక్యాలు అన్నీ కేసిఆర్ కు, ఆయన పార్టీ ఓటమికి మాత్రమేనా? చంద్రబాబుకు ఆయన పార్టీ పరాజయానికి కూడా పక్కాగా సూట్ అవుతాయా? అన్న అనుమానం.

పై వాక్యాలు అన్నీ చంద్రబాబు అండ్ కో కు కూడా పక్కాగా సరిపోతాయి. అందులో సందేహం లేదు. వైకాపాను చీల్చేసి, జనాలను లాగేస్తే సరిపోతుందని, మీడియా తన గుప్పిట్లో వుంది కాబట్టి ఎవరూ ఏమీ పీకలేరని, పసుపు కుంకుమ అంటూ డబ్బులు ఇచ్చా కాబట్టి ఓట్లు వచ్చేస్తాయని, తరచు తమ వారి స్టార్ హోటళ్లను మేపడానికి అక్కడ సెమినార్లు పెడుతూ, చార్టర్ ఫ్లయిట్లలో తిరుగుతూ దర్జా లైఫ్ కు అలవాటు పడడం, క్షేత్ర స్థాయిలో జనం మనో భావాలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం, కింద స్థాయిలో నాయకుల అవినీతిని అడ్డుకట్ట వేయకపోవడం, సోషల్ మీడియాలో యువత ప్రభుత్వం నిగ్గుతీయడం, కుటుంబ పాలన వ్యవహారాలు ఇవన్నీ చంద్రబాబు ఆయన తెలుగుదేశం పార్టీ గత పాలన వ్యవహారాలకు అద్దం పడతాయి. 

సరే, ఆ సంగతి అలా వుంచితే తెలుగులో సమయానికి లేని బాజా..అనే నానుడి వుంది. నిజంగా పాలక పార్టీల మేలు కోరేవారు అయి వుంటే ఎన్నికల తరువాత ఇవన్నీ ఏకరవు పెట్టడం కాదు. ఈ తప్పులు జరుగుతున్నపుడు ఇదే సుతిమెత్తని భాషలో హెచ్చరించివుంటే బాగుండేది. అది చంద్రబాబు కు అయినా, కేసిఆర్ కు అయినా. కానీ తోటకూర నాడు చెప్పడం మానేసారు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

అదే ఆంధ్రలో చూడండి. నిత్యం జగన్ మీద ఎక్కడెక్కడి బురద తెచ్చి ఎలా పోస్తుంటారో? తమకు నచ్చకపోతే అలా..నచ్చితే ఇలా. కాలమ్ పాతదే..పలుకు పాతదే..పేరు మాత్రమే కొత్త పలుకు.

ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతా