Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఎవరిది తప్పు.…తిరుమలేశా?

ఎవరిది తప్పు.…తిరుమలేశా?

సుబ్బారెడ్డి చైర్మన్ అయన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక విషయంలో వార్తలకు ఎక్కుతూనే వుంది. పాలక మండలి అనాలోచిత నిర్ణయాల పుణ్యమా అని విమర్శలకు గురి అవుతూనే వుంది. 

లేటెస్ట్ గా వేసవి రద్దీని, ఉచిత దర్శనం, సర్వ దర్శనం పాస్ ల వ్యవహారాన్ని చూస్తుంటే భక్త జ‌నాలకు మండుకొస్తోంది. దారుణమైన వేసవి ఎండలో పిల్లలతో, ఆడవాళ్లతో భయంకరమైన క్యూలలో గంటలకు గంటలు నిల్చోవాల్సిన దుస్థితి భక్తులకు దాపురించింది అంటే దానికి కారణం ఎవరు?

తిరుపతి దేవుడి దర్శనాన్ని, సేవలను కూడా దేవస్థానానికి భయంకరమైన ఆదాయమార్గంగా చూస్తున్న చైర్మన్ సబ్బారెడ్డినా? భక్తులకు కనీసపు నీడ కల్పించాలన్న ఆలోచన కూడా లేకుండా ఎసి గదుల్లో కూర్చుని హాయిగా పని చేస్తున్న అధికారులా? తిరుపతి దేవుడిని దర్శించుకోవడానికి వేసవి వేళ దేశం నలుమూలల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారన్న మినిమమ్ కామన్ సెన్స్ పాలకమండలికి కానీ అధికారులకు కానీ లేదా?

ఒక్కరోజు చైర్మన్ నో, పాలకమండలి సభ్యులో కొన్ని గంటల పాటు అలా ఎండలో నిల్చుంటే పేదవాడి కష్టం ఏమిటో తెలుస్తుంది. అసలే జ‌గన్ ప్రభుత్వాన్ని హిందువులను డిటాచ్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. జ‌గన్ దయతో టీటీడీ చైర్మన్ పదవి పొందిన సుబ్బారెడ్డి కూడా ఈ దిశగానే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. జ‌గన్ కు బాబాయ్ మేలు చేయకపోగా మరింత కీడు చేస్తున్నట్లు కనిపిస్తోంది తన పదవి ద్వారా.

ఇక మిగిలింది ఒకటే దారి. ఎండల్లో మాడుతున్న భక్తుల ఫొటొలను, వారి బాధలను కోర్టు దృష్టికి ఎవరైనా తీసుకెళ్లాల్సి వుంది. అక్కడి నుంచి మొట్టికాయలు వస్తే తప్ప మన అధికారులకు స్పృహరాదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?