Advertisement

Advertisement


Home > Politics - Gossip

అందరూ ఆమోదిస్తున్న తీర్పు ఇది

అందరూ ఆమోదిస్తున్న తీర్పు ఇది

అయోధ్య లోని వివాదాస్పద స్థలానికి సంబంధించి.. వెలువడిన సుప్రీం కోర్టు తీర్పుపై సర్వత్రా ఆమోదమే వ్యక్తం అవుతోంది. తీర్పు ఎలా వచ్చినప్పటికీ.. దానిపట్ల వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రకటనలు, ప్రసంగాలు, ప్రచారాలు ఉండకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. శనివారం నాటి తీర్పులో వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి కేటాయిస్తూ.. బాబ్రీ మసీదు నిర్మాణానికి మరో అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ.. ఇరు వర్గాలను అసంతృప్తికి గురిచేయని విధంగా పేర్కొన్నారు.

అన్నింటికంటె అదృష్టంగా భావించాల్సిన విషయం ఏంటంటే.. ఈ తీర్పు రాజకీయ ప్రచారాలకు, వైషమ్యాలకు మారే ప్రమాదం.. ఇప్పటిదాకా కనిపించలేదు. అటు పాలక ప్రతిపక్షాలు, చాలా మటుకు రాజకీయ పార్టీలు కూడా సుప్రీం కోర్టు తీర్పును ఆహ్వానించదగ్గదే అంటున్నాయి.

ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. రామ భక్తి, రహీం భక్తి కాదు, భారత భక్తి వెల్లడి కావాలని ఆయన అభిలషించారు. దేశ ప్రజలంతా శాంతి సద్భావనలతో మెలగాలని ఆయన పిలుపు ఇచ్చారు. అదే సమయంలో విపక్ష నాయకుడు రాహుల్ కూడా అంతే హుందాగా స్పందించారు. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామని, భారతీయులు సోదర భావం, నమ్మకం, ప్రేమకు ఇది సరైన సమయం అని ఆయన అన్నారు. చాలా వరకు దేశంలోని ఇతర పార్టీల వారు కూడా తీర్పును స్వాగతించారు.

పిటిషన్ వేసిన ముస్లిం వర్గాలు కూడా తీర్పు పట్ల సంతృప్తి వెలిబుచ్చాయి. బాబ్రీ మసీదు కోసం పోరాడిన ఒకటిరెండు ముస్లిం వర్గాలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశాయి. మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా రాజ్యాంగంపై నమ్మకం ఉన్నదని అంటూనే.. బాబ్రీ మసీదు కోసం ఐదెకరాల వేరే స్థలం కేటాయించడాన్ని తిరస్కరించారు. ఆ స్థలం తమకు వద్దు అన్నారు. ఇలాంటి చెదురుమదురు అసంతృప్తులు మినహా.. ముస్లిం వర్గాల్లో కూడా పెద్ద వ్యతిరేకత కనిపించడం లేదు.

మొత్తానికి భారత సౌభ్రత్రానికి నిదర్శనమైన రీతిలో ఈ తీర్పు పట్ల దేశం స్పందిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?