యూటర్న్.. రివర్స్ లో మోగబోతున్న గంట..?

గంటా శ్రీనివాసరావు రాజకీయాలే వేరు. అవకాశవాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీని కానీ, ఏ నియోజకవర్గాన్ని కానీ పర్మినెంట్ గా ఉంచుకోరు.  Advertisement విచిత్రం ఏంటంటే.. ఆయన ఏ…

గంటా శ్రీనివాసరావు రాజకీయాలే వేరు. అవకాశవాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ఎప్పుడూ ఏ పార్టీని కానీ, ఏ నియోజకవర్గాన్ని కానీ పర్మినెంట్ గా ఉంచుకోరు. 

విచిత్రం ఏంటంటే.. ఆయన ఏ నియోజకవర్గానికి వచ్చినా, ఏ పార్టీ టికెట్ పై పోటీ చేసినా.. ఇప్పటి వరకూ ప్రజలు ఆదరిస్తూనే వచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన విశాఖలో టీడీపీ ప్రజా ప్రతినిధిగా ఉన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన రాజీనామా కూడా చేశారు.

అయితే ఓ దశలో వైసీపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని, అక్కడ గంటాని తీసుకోవడం విజయసాయిరెడ్డికి ఇష్టం లేదని, అందుకే ఆయన ఎంట్రీ ఆలస్యమవుతోందనే వార్తలొచ్చాయి. అయితే గంటా టీడీపీకి మాత్రం దూరంగానే ఉంటూ వస్తున్నారు. 

పార్టీ కార్యకలాపాలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. స్థానిక సమస్యలపై కూడా స్పందించడం ఆపేశారు. అధినేత విశాఖ వచ్చినా కూడా ఆయన మాత్రం రారు. ఈ క్రమంలో పట్టాభి ఎపిసోడ్ తర్వాత సడన్ గా గంటా పేరు వినిపించింది. 

పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడిని ఖండించిన గంటా.. అప్రయత్నంగానే కాస్త మోగింది. దీంతో అందరూ ఆయన టీడీపీలోనే కొనసాగుతారని అనుకున్నారు. కానీ చంద్రబాబు దీక్షకు కేశినేని నాని లాంటి వారు వచ్చారు కానీ గంటా మాత్రం రాలేదు. హీనపక్షం గెలిచిన ఎమ్మెల్యేలలో సగం మంది బాబు దీక్షకు మొహం చాటేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే గంటా విషయానికొస్తే ఆయన యూ టర్న్ తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

యూ టర్న్ అంటే.. టీడీపీ నుంచి బయటకు రావడం మాత్రం ఖాయం. కాకపోతే వైసీపీ ఆఫీస్ లో మోగాల్సిన గంట, జనసేన కార్యాలయంలో మోగబోతోంది అంతే తేడా.

పవన్ తో మంతనాలు..

కాపు వర్గం అనే బ్రాండింగ్ తో గతంలో చిరంజీవికి దగ్గరైన గంటా శ్రీనివాసరావు.. ఇప్పటికీ మెగా కాంపౌండ్ కి నమ్మకస్తుడిగానే ఉన్నారు. అయితే జనసేనకు మాత్రం ఆయన దగ్గరకాలేదు. ఇటీవల పవన్ కల్యాణ్ కాపు స్టాండ్ తీసుకోవడంతో గంటా కూడా ఆ కోణంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ కాపు నేతలతో చర్చలు జరిపారట. పవన్ తో కలసి వెళ్తే ఎలా ఉంటుందని తన అనుయాయులతో డిస్కస్ చేశారట.

వైసీపీ ప్రయత్నాలు ఎలాగూ ఫలించడంలేదు కాబట్టి.. వచ్చే ఎన్నికలనాటికి జనసేన పరిస్థితి మెరుగైతే ఆవైపు గోడ దూకడానికి గంటా రెడీగా ఉన్నారట. ఈమేరకు పవన్ కి సంకేతాలు పంపించారని టాక్. టీడీపీలో ఉండలేక, వైసీపీకి వెళ్లలేక, ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు గంటా. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్ పక్కనే గంట మోగుతుంది.