టీ20 మ్యాచ్‌లో భారత్‌పై దాయాది జట్టు పాకిస్థాన్ గెలుపొందడంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఆటలో భాగమని కొందరు, మరికొందరు మాత్రం ఉగ్రవాద దేశంతో మ్యాచ్‌లేంటని ప్రశ్నిస్తుండడం గమనార్హం. మరీ ముఖ్యంగా భారత్ టార్గెట్‌ను పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించడం మన దేశ క్రీడాభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రముఖుల అభిప్రాయాలేంటో తెలుసుకుందాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ… గెలుపోటములన్నీ ఆటలో భాగమన్నారు. టీమిండియా మున్ముందు బాగా పుంజుకుని ప్రపంచ్ కప్ గెలవడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
రాబోయే మ్యాచ్‌లకు అరవింద్ కేజ్రీవాల్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ…. ప్రపంచ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఫలితాన్ని తిప్పికొడుతుందనే ఆశాభావాన్ని ట్వీట్ ద్వారా వ్యక్తం చేశారు.
ఇదే అంశంపై ప్రముఖ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తన మార్క్ ట్వీట్ చేశారు.
ఉగ్రవాద రాజ్యమైన పాకిస్థాన్ తో మన టీమిండియా జట్టు క్రికెట్ ఆడకూడదని కోరారు. ప్రతిరోజు అమాయక పౌరులను చంపేస్తున్న దురాక్రమణదారైన పాకిస్థాన్‌తో మనం ఆడకూడదని స్వామిపేర్కొన్నారు.
బీసీసీఐలో నిర్ణయాధికారికి 2021 సంవత్సరానికి బుద్ధుని బిరుదు ఇవ్వాలని స్వామి వెటకరించడం గమనార్హం. భారత్, పాకిస్థాన్‌లను శత్రు దేశాలుగా చిత్రీకరించడం వల్లే తీవ్ర భావోద్వేగాలు నెలకుంటున్నాయనేది ప్రత్యేకంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది.