కోర్టులను కానీ, న్యాయమూర్తులను కానీ ప్రభావితం చేయరాదు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తులను కలిసే ప్రయత్నం చేయడం కూడా చేయకూడదు అని చెబుతారు. న్యాయమూర్తుల ఇళ్లకు వెళ్లడం, చాంబర్ లకు కక్షిదారులు వెళ్లడం చేయకూడదు అంటారు. ఇలాంటివి కేసును ప్రభావితం చేస్తాయనే ఉద్దేశంతో అలా అంటారు.
మరి ఇప్పుడు అమరావతి రైతులు అంటూ పలువరు మహిళలు, ఖరీదైన చీరలు ధరించి, రోడ్డు పక్కన లైనుగా నిల్చుని, మోకాళ్లపై కూర్చుని, న్యాయమూర్తులకు నమస్కరిస్తూ ఓ ప్రదర్శన చేసారు. అమరావతిలో హైకోర్టుకు న్యాయమూర్తులు వెళ్లే దారిలో వీరంతా రోడ్డు పక్కన ప్రదర్శనగా నిల్చుని ఈ తరహా విన్నపానికి శ్రీకారం చుట్టారు.
మరి ఇలా చేయడం అన్నది ఎంత వరకు కరెక్ట్ అన్నది న్యాయశాస్త్రం ఔపాసన పట్టినవారే తెలియచేయాలి? ఇలా భావోద్వేగాలు ప్రదర్శించి, కేసు విచారించే న్యాయమూర్తులను ప్రభావితం చేసే ప్రయత్నం చేయవచ్చా? అన్నది సందేహం.