ఏపీ ముఖ్యమంత్రి అదృష్టవశాత్తు కరోనా నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అయితే అది కొవిడ్ 19 వైరస్ మాత్రం కాదులెండి. జగన్ తప్పించుకున్నది ఎల్లో వైరస్ నుంచి అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.
కొంత కాలంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ల వల్లే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం, మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఇది నిజం కూడా. అందువల్లే జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసి విదేశాల నుంచి మనదేశంలోకి ఇతరుల రాకకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. మన దేశంలో కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా వ్యవస్థను నిలిపివేడయం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించ వచ్చనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ చేపట్టింది. ఇది ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలను ఢిల్లీ దడ పట్టుకొంది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీద్‌లో మార్చి 1 నుంచి మత సమావేశాలు జరిగాయి. ఈ నెల 16,17న జరిగిన సమావేశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2 వేల మంది ముస్లింలు పాల్గొన్నట్టు సమాచారం. అలాగే ఈ మత సమావేశాలకు ఇరాన్, ఇండోనేషియా దేశాలకు చెందిన మత బోధకులు రావడం, వాళ్ల నుంచి కరోనా మనవాళ్లకు సోకిందనే ఇప్పుడిప్పుడే ఆధారాలు బయటపడుతున్నాయి.
అక్కడి నుంచి వచ్చిన వాళ్లలో 8 మంది కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణ వాసులు ఐదుగురు ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వాళ్ల కోసం జల్లెడ పడుతున్నారు. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరిని గుర్తించి క్వారంటైన్‌కు పంపారు.
ఇక్కడ ప్రధానంగా చెప్పాలనుకున్నది ఏంటంటే…ఒక వేళ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రిస్టియన్లు ఒక్క ఢిల్లీనే కాదు, దేశంలోని ఏ ఒక్క ప్రాంతంలో సువార్త స్వస్థత కూటముల్లోనో లేక ఇతరత్రా క్రిస్టియన్ మత ప్రచార సభల్లోనే పాల్గొని కరోనాకు గురి అయి ఉంటే….పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి అంచనా వేయండి. దీనంతటికి ఏపీ సీఎం జగనే కారణమని, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణకు జగన్ మత ప్రచారాలు, మత మార్పిడులు కారణమని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గగ్గోలు పెట్టడం, వాళ్లకు ఎల్లో మీడియా జత కలిసి…రచ్చరచ్చ చేసేవి.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని జగన్ తీసుకున్న నిర్ణయానికి మత మార్పిడులను అంటకడుతూ కొత్తపలుకులు రాసిన ప్రబుద్ధ జర్నలిస్టు యజమానులున్న తెలుగు రాష్ట్రాల్లో, ప్రతిదీ మతం దృష్టితో మాట్లాడిన జనసేనాని, ఆయన యజమాని కలిసి కరోనాను కూడా రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోరనే గ్యారెంటీ లేదు.
ఢిల్లీకి వెళ్లి వచ్చింది ముస్లింలు కావడంతో…జగన్ కరోనా విజృంభణకు కారకుడనే అపప్రద నుంచి తప్పించుకోగలిగాడు. లేదంటే ఈ పాటికి ఎల్లో వైరస్‌లు రామోజీ, ఆర్‌కే, మూర్తి, సాంబశివరావు, వెంకటకృష్ణ….తదితర మహా మేధావి జర్నలిస్టులు ముక్తకంఠంతో తమతమ చానళ్లలో జెజ్జనక తొక్కేవాళ్లు. అదృష్టం బాగుండి ఎల్లో వైరస్ నుంచి జగన్ తప్పించుకున్నాడు.