Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ విపక్షాల ఉచ్చులో పడుతున్నాడా?

జగన్ విపక్షాల ఉచ్చులో పడుతున్నాడా?

జగన్మోహన రెడ్డి తాను సీఎం అయితే ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో చాలా ముందుకాలంనుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే కార్యరూపంలో పెట్టడం ప్రారంభించారు. సహజంగానే ప్రతి నిర్ణయం గురించి విపక్షాల వైపునుంచి విమర్శలు రావడమూ షురూ అయింది. అయితే ఆయన పట్టించుకోకుండా.. తాను తలచిన పని చేసుకుంటూ పోయారు.

దీనికంతా కూడా తను తీసుకుంటున్న నిర్ణయాల గురించి, తప్పు చేయడం లేదని.. ఆయనలో ఉన్న విశ్వాసమే కారణం అనిపించింది. కానీ.. ఇప్పుడు పరిణామాలను గమనిస్తోంటే.. క్రమంగా ఆయన విపక్షాల ఉచ్చులో పడిపోతున్నట్లు కనిపిస్తోంది.

‘మైండ్‌గేమ్’ అనే వ్యాపార/ యుద్ధ వ్యూహాలను రాజకీయాల్లో అమల్లో పెట్టడంలో చంద్రబాబునాయుడు సిద్ధహస్తుడు. అనుభవజ్ఞుడు కూడా. పైగా ఆయన గోబెల్స్ ప్రచార సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాడు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా, పదిమందితో పదేపదే చెప్పించడం ద్వారా నిజంగా ప్రజలందరినీ నమ్మింపజేయవచ్చుననే సిద్ధాంతం ఆయనకు బాగా తెలుసు.

జగన్ ప్రభుత్వం మీద కూడా ఆయన అదే మైండ్ గేమ్ సిద్ధాంతం ప్రయోగించారు. చూడబోతే అందరూ తనను తప్పు- తప్పు అంటుండే సరికి జగన్ కూడా.. తప్పు జరుగుతున్నదేమో.. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయాలి.. అనే భావనతో.. ప్రత్యర్థులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లుగా వారు బిగిస్తున్న ఉచ్చులో పడిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

నిన్నటికి నిన్న ఆయన తెలుగుమీడియం తొలగింపుపై మాట్లాడారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా రాష్ట్రంలో మీడియంపై ప్రత్యేకంగా కామెంట్ చేయకపోయినా.. జనాంతికంగా సంస్కృత భాషా కార్యక్రమంలో మాతృభాషకు విలువ ఇవ్వడం గురించి మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి... పేరుపెట్టి ప్రతివిమర్శలు చేస్తూ చిన్న వివాదానికి కారణం అయ్యారు.

ఇప్పుడు ఇసుక వారోత్సవాలు.. అంటూ ఈ ఏడు రోజుల పాటూ రోజుకు రెండు లక్షల టన్నుల ఇసుక ఇవ్వాలనే వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇసుక విక్రయాలను ఉత్సవాలుగా నిర్వహించే దుస్థితి దాపురించడం అంటేనే..  అది ప్రభుత్వ వైఫల్యం కింద లెక్క తేలుతుంది.

రోజువారీ ఇసుక అవసరాలు సగటున లక్షన్నర టన్నులు ఉండగా.. ఈ ఏడు రోజులు రెండు లక్షల టన్నులు ఇవ్వాలని సీఎం అంటున్నారు. ఆ తర్వాత.. ఏం చేయదలచుకున్నారు??

ఇలాంటి ఉత్సవాలు, హడావిడి అన్నీ.. ప్రతిపక్షాల ఉచ్చులో పడడానికి నిదర్శనాలే. కొరత అనే మాట కనిపించకుండా... ఇసుక అందుబాటులో ఉంచితే చాలు... ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూస్తూ ఉన్నప్పటికీ.. ప్రజాలు వాటిని ఖాతరు చేయకుండా.. ప్రభుత్వపు శ్రద్ధను గుర్తించగలరని.. దానికి ఉత్సవాల పేరుతో హడావుడి అవసరం లేదని జగన్ తెలుసుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?