Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ స్పెషల్ అట్రాక్షన్ అదే

బన్నీ స్పెషల్ అట్రాక్షన్ అదే

బన్నీ సినిమా అలవైకుంఠపురములో ప్రచారం అంతా ఓ ప్లాన్డ్ గా జరుగుతోంది. హారిక హాసిని యూనిట్ వెల్ ప్లాన్డ్ గా ప్రచారం సాగిస్తోంది. దానికి బన్నీ నుంచి ఫుల్ సపోర్ట్ అందుతోంది. హారిక హాసిని యూనిట్ వెబ్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందుకోసం ఓ టీమ్ ను ప్రత్యేకంగా నియమించుకుని, ముందుకు వెళ్తోంది. దాంతో ఫుల్ బజ్ ను తెచ్చుకోగలిగింది.

14న ఓ స్పెషల్ సర్ప్రయిజ్ వుంటుందని గ్రేట్ ఆంధ్ర ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో 'డాడీ ..డాడీ' అనే సాంగ్ ఒకటి వుంది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ పాట ను జస్ట్ చిన్నగా పరిచయం చేయబోతున్నారు. అయితే అది మాత్రమే సర్ప్రయిజ్ కాదు.

14న చిల్ట్రన్స్ డే కాబట్టి, బన్నీ కొడుకు ఆయాన్ మీద కట్ చేసిన ఓ విడియో బైట్ మీద ఆ పాటను రన్ చేసి విడుదల చేస్తారని తెలుస్తోంది. అది అసలు సిసలు సర్ప్రయిజ్. బన్నీకి పిల్లలు అంటే భలే ముద్దు. బన్నీ పిల్లలు కూడా భలే ముద్దుగా వుంటారు. ఆ మధ్య బన్నీ తన కుమార్తెతొ చిన్న చిన్న విడియోలు కూడా చేసి వదిలాడు. 

ఇప్పుడు తన సినిమాలోని డాడీ పాటను తన కొడుకు మీద విడియో కట్ చేసి వదలడం అంటే కచ్చితంగా సినిమాకు మరింత క్రేజ్ తెచ్చే విషయమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?