Advertisement

Advertisement


Home > Movies - Movie News

హీరో రాజశేఖర్ కు యాక్సిడెంట్

హీరో రాజశేఖర్ కు యాక్సిడెంట్

హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో రాజశేఖర్ కారులోనే ఉన్నారు. ఆయనకు గాయాలు తగిలినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ తో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలైనట్టు సమాచారం.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శంషాబాద్ దగ్గరున్న పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చిన వెంటనే రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. సకాలంలో కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఘటన జరిగిన వెంటనే రాజశేఖర్ మరో వాహనంలో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అతడికి తగిలిన గాయాలు చిన్నవే అంటున్నారు ఘటనాస్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు. రాజశేఖర్ ఇలా ప్రమాదానికి గురవ్వడం ఈమధ్య కాలంలో ఇది వరుసగా మూడోసారి. గతంలో ఎయిర్ పోర్ట్ కు వెళ్తూ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ యాక్సిడెంట్ నుంచి తృటిలో ఆయన తప్పించుకున్నారు. కల్కి సినిమా షూటింగ్ టైమ్ లో కూడా రాజశేఖర్ కు యాక్సిడెంట్ జరిగింది.

తాజాగా రాజశేఖర్ కు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి అతి సమీపంలోనే మరో హీరో రాజ్ తరుణ్ కు కూడా గతంలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంపై రాజశేఖర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఔటర్ పై ప్రమాదం జరగడంతో కచ్చితంగా ఈ ఘటన సీసీ టీవీలో రికార్డ్ అయి ఉంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?