బాబు విఫలమైన చోటే.. జగన్ శ్రద్ధ!

ముఖ్యమంత్రిగా  పని చేసినప్పుడు ప్రజల సంక్షేమం చూడడంలో చంద్రబాబునాయుడు ఎక్కడ విఫలమయ్యారో….  సరిగ్గా ఆయా అంశాల దగ్గరే జగన్మోహన్ రెడ్డి మరింత శ్రద్ధ పెడుతున్నారు.   కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు …

ముఖ్యమంత్రిగా  పని చేసినప్పుడు ప్రజల సంక్షేమం చూడడంలో చంద్రబాబునాయుడు ఎక్కడ విఫలమయ్యారో….  సరిగ్గా ఆయా అంశాల దగ్గరే జగన్మోహన్ రెడ్డి మరింత శ్రద్ధ పెడుతున్నారు.   కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు  తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం వస్తే…  ప్రజలను విస్మరించి మాటలతో గారడీ చేసిన చంద్రబాబు ప్రజల తిరస్కారాన్ని ఎదుర్కొన్నారు.  అదే పొరపాటు చేయకుండా,  ప్రజలకు, వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారు.  తాజాగా పోలవరం డ్యాం నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్లిన సందర్భంగా కూడా ఇదే విషయం మరోమారు స్పష్టమైంది.

పోలవరం డ్యాం నిర్మాణ పనులను చంద్రబాబు నాయుడు జమానాలో ప్రతి సోమవారం సమీక్షిస్తూ ఉండేవారు. డ్రోన్ కెమెరా లతో వీడియో ఫుటేజీ లు,  ప్రతి సోమవారం వీడియో లైవ్ సమీక్షలు ఇలా నానా హంగామా జరుగుతూ ఉండేది.  ఏదో అయిపోతున్నట్లుగా  ప్రతి సోమవారం వార్తలు వస్తూ ఉండేవే గానీ… పనుల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉండేది.  అన్నిటినీ మించి నిర్వాసితుల కష్టాలు అంతా ఇంతా కాదు.  చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్లు,  టెండరు ధరలను రివైజ్డ్ చేయడం మీద శ్రద్ధ పెట్టినట్టుగా,  నిర్వాసితుల గురించి పట్టించుకోలేదు.  జగన్మోహన్ రెడ్డి అక్కడే తన ముద్ర చూపిస్తున్నారు.

పోలవరం డ్యాం పనులను పరిశీలించిన జగన్మోహన్ రెడ్డి ముందుగా సహాయ పునరావాస పనుల మీద దృష్టి పెట్టాలని ఆదేశించడం గమనార్హం. ఈ ఏడాది జూన్లో గా స్పిల్వే కాపర్ డ్యాం పనులను పూర్తి చేయాలని ఆదేశించిన జగన్,  అందువలన తరలించాల్సి వచ్చే 17 వేల కుటుంబాల పునరావాస కార్యక్రమాల కోసం తక్షణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.  ఇందుకు 5 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని,  తక్షణం రెండు వందల కోట్లు విడుదల చేస్తామని అన్నారు.  సహాయ పునరావాస కార్యక్రమాలకు,  నిర్వాసితుల నిర్మించడానికి అవసరమయ్యే నిధులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ప్రాజెక్టు పేరిట అభివృద్ధి పనుల గురించి మొక్కుబడి చర్చలు నిర్వహించి,  అంతటితో ముగింపు పలకడం చంద్రబాబు శైలి అయితే…  జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రాజెక్టు పనులు తోపాటుగా నిర్వాసితుల పునరావాస మీద కూడా సమానంగా దృష్టి పెట్టడం ప్రశంసలు పొందుతోంది.

క్రైమ్ జరగక ముందే ఆపడానికి వచ్చే టీం