మోదీ-జగన్ భేటీ.. బాబులో మొదలైన టెన్షన్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు ప్రధాని మోడీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మోడీని సాదరంగా ఆహ్వానించారు. ఇవన్నీ ఫార్మాలిటీస్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. పద్మావతి గెస్ట్ హౌజ్ లో మోడీ-జగన్ ఏకాంతంగా సమావేశయ్యారు.…

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు ప్రధాని మోడీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మోడీని సాదరంగా ఆహ్వానించారు. ఇవన్నీ ఫార్మాలిటీస్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. పద్మావతి గెస్ట్ హౌజ్ లో మోడీ-జగన్ ఏకాంతంగా సమావేశయ్యారు. చాలా అంశాలపై మాట్లాడుకున్నారు. చంద్రబాబును కలవరపెడుతున్న ఎలిమెంట్ ఇదే.

ఇక్కడ జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పట్నుంచి, సేమ్ టైం అటు మోడీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పట్నుంచి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు. వీళ్లిద్దరూ కలిసి తనను జైలుకు పంపిస్తారనే భయం చంద్రబాబులో బాగా పేరుకుపోయింది. విశ్లేషకులు చెబుతున్న మాట కూడా ఇదే. ఇలాంటి టైమ్ లో మోడీ-జగన్ ఏకాంతంగా కలిస్తే ఇంకేముంది. బాబు టెన్షన్ పీక్స్ కు చేరుకుంది.

గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు సాగించిన అరాచక పాలనను ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. ఇదొక ఎత్తయితే, బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత బాబు చేసిన విమర్శలు మరో ఎత్తు. అలాఅని బాబు, బీజేపీని పూర్తిగా విమర్శించలేదు. తనకు బీజేపీ అంటే ఇష్టమేనని, మోడీతోనే సమస్య అంటూ వ్యక్తిగత దూషణకు దిగారు. మోడీ స్థానంలో గడ్కరీ ప్రధాని అయితే తనకు అభ్యంతరం లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ మోడీ చెవిన పడ్డాయి.

తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన వాళ్లను ఎలా మోడీ ఎలా కార్నర్ చేస్తారో అందరికీ తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో మోడీ చేతిలో చావుదెబ్బ తిన్న నేతలు దేశవ్యాప్తంగా ఎంతోమంది. ఇప్పుడీ లిస్ట్ లోకి బాబు కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బాబు ఈ టెన్షన్లలో ఉంటుండగానే, మరోవైపు మోడీ-జగన్ కలిశారు. ఏకాంతంగా సంభాషించుకున్నారు.

తనపై కేసులు పడతాయనేది ఒక భయమైతే, తన పార్టీ ఎక్కడ భూస్థాపితం అవుతుందో అనే భయం కూడా బాబులో ఉంది. ఉన్నది చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు. వాళ్లను ఆకర్షించడం పెద్ద పని కాదు. కాకపోతే ఇలాంటి వలసల్ని ప్రోత్సహించనని జగన్ ఇప్పటికే చెప్పడంతో బాబు ఊపిరిపీల్చుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఆగడంలేదు.

టీడీపీని నిర్వీర్యం చేసి, రాష్ట్రంలో నంబర్-2 స్థానంలోకి రావాలని చూస్తున్న కమలనాధులు.. టీడీపీ ఎమ్మెల్యేల్ని ఆకర్షించడం ప్రారంభించారు. తాజాగా ఏపీలో మోడీ అడుగుపెట్టడంతో ఈసారి టీడీపీ నుంచి బీజేపీలోకి జంపింగ్ ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ కలిపి బాబును ఇప్పుడు టెన్షన్ కు గురిచేస్తున్నాయి.

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్