నాదెండ్ల మనోహర్ జనసేనను వీడరని, ఆ పార్టీతోనే వుంటారని క్లారిఫికేషన్. ఆ సంగతి అలావుంచితే, వీడాలంటే వేరే పార్టీ అంటూ వుంటాలిగా? నాదెండ్లకు అయినా, జెడికి అయినా జనసేన తప్ప మరోదారి లేదు అనే అనుకోవాలి. ఎందుకంటే వైకాపాలోకి తీసుకోరు. తెలుగుదేశం చతికిలపడింది. ఇప్పుడు వెళ్లి ప్రయోజనం లేదు. పైగా నాదెండ్లను ఆ పార్టీ కూడా తీసుకోదు.
ఇక మిగిలిన ఆప్షన్ భాజపానే. ఇప్పుడు భాజపాలోకి వెళ్లే అవకాశం వుంటుందా? అన్నది కూడా అనుమానం. భాజపాను బలోపేతం చేసుకునేందుకు కొత్త జనాలను చేర్చుకుంటారు కానీ, అక్కడ జగన్ మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం వుండోచ్చు. ఎందుకంటే ఎంతకాదన్నా భాజపా-వైకాపాకు ఇప్పడు ఒక కనిపించని బంధం అంటూ ఏర్పడి వుండొచ్చు.
ఇప్పటికే చాలామంది తేదేపా నాయకులు భాజపాలోకి జంప్ చేసి, అయిదేళ్లపాటు లేనిపోని తలకాయనొప్పుల నుంచి తప్పించుకునే ఆలోచనలో వున్నట్లు వార్తలు అందుతున్నాయి. కానీ అటు నుంచి ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రావడంలేదు. అందుకే అలా అబేయన్స్ లో వున్నారు.
వెనకటికి ఓ మోటు సామెత వుంది. ఆ మాదిరిగా ఎక్కడికి వెళ్లే అవకాశం లేనివారు, ఇలా పార్టీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శిస్తారేమో? రాజకీయ నాయకులకు బై డీఫాల్ట్ జంపింగ్ కళ వుంటుంది. అదిలేదు అంటే అనుమానించాలి.