భలే మంచి రోజు ఓ డిఫరెంట్ సినిమా. అయితే నిర్మాతలకు లాభాలు కుమ్మేసిన సినిమా కాదు. శమంతకమణి ఓ ఫ్లాపు సినిమా. నిర్మాతలకు నష్టాలే. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేయబోతున్నారు ఆ సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అని తెలుస్తోంది.
సరైన లాంచింగ్ కోసం చూస్తున్న ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ ప్రాజెక్టుకు శ్రీరామ్ ఆదిత్య సారథ్యం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గల్లా అశోక్ లాంచింగ్ కోసం ఆదిలో నిర్మాత దిల్ రాజు ట్రయ్ చేసారు. కృష్ణారెడ్డి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేసి, అశోక్ ఫెర్ ఫార్మెన్స్ చూసి, సైలెంట్ గా ప్రాజెక్టు ఆపేసారు. ఆ ప్రాజెక్టును రాజ్ తరుణ్ కు షిప్ట్ చేసేసారు.
దాంతో ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్యతో ఈ ప్రాజెక్టు సెట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈసారి నిర్మాత ఎవరో? ఎందుకంటే దిల్ రాజు ముందుకు వెళ్లకపోవచ్చు. అందువల్ల గతంలో చాలామంది వారసులను లాంచ్ చేసిన మాదిరిగా వేరే ప్రొడ్యూసర్ పేరు పెట్టి, ఫండింగ్ చేసి నిర్మించే ఆలోచనే జరుగుతోందని బోగట్టా.