cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఓల్డ్ గెటప్ లో రానా

ఓల్డ్ గెటప్ లో రానా

హాథీ మేరీ సాధీ.. కాదన్.. అరణ్య.. భాషకు ఓ టైటిల్. కానీ సినిమా ఒక్కటే. రానా దగ్గుబాటి నటించే సినిమా. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెడీ అవుతోంది. కార్పొరేట్ కుట్రకు అరణ్యం నాశనమైపోతుంటే పోరాడే అడవి పుత్రుడి కథ. అతనికి అంతగా నిలిచే ఏనుగుల కథ. ఈ సినిమాతో అడవిరాముడులో ఎన్టీఆర్ లా రానా హీరోయిజంతో కనిపిస్తాడని గ్యాసిప్ లు వినిపించాయి. కానీ కాదట.

ఈ సినిమాలో రానా లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అది కరెక్టే. విష్ణు విశాల్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ విశేషాలన్నీ దాదాపు తెలిసినవే. అయితే తెలియని కొత్త సంగతి ఏమిటంటే, ఈ సినిమాలో రానా గ్రే హెయిర్, గ్రే బియార్డ్ తో కాస్త అబౌవ్ మిడిల్ ఏజ్డ్ గెటప్ లో కనిపిస్తాడన్నది. ఇందుకోసం రానా తన జుట్టుకు తెల్లరంగు వేసుకోవాల్సి వచ్చిందన్నది.

ముంబాయి, కేరళలో షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మాంచి అంచనాలు వున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జంతువులతో మన భాషలో సినిమా రావడం అన్నది చాలా తక్కువ. అలాంటిది ఏనుగులతో యాక్షన్ ఎపిసోడ్ లు వున్న సినిమా అంటే జనాలకు కాస్త ఆసక్తికరమే. 

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్