Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ జీ! ఈ భేటీపై చాలా అంచనాలున్నాయ్!

జగన్ జీ! ఈ భేటీపై చాలా అంచనాలున్నాయ్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం తొలిసారిగా సమావేశం కాబోతోంది. ఇవాళ తొలి కేబినెట్ భేటీ జరుగుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పదిరోజులుగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన శైలిని బట్టి... ఇప్పుడు జరగబోతున్న తొలి కేబినెట్ భేటీ మీద ప్రజల్లో చాలా అంచనాలే ఉన్నాయి. సంక్షేమం దిశగా, చాలా ప్రాక్టికల్ ఎప్రోచ్ తో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ఈ తొలిభేటీలో కూడా ప్రజల మన్ననలను మరింతగా చూరగొనే కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకుంటుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

సీఎం అయిన తొలినాటినుంచి జగన్మోహన్ రెడ్డి తన ముద్ర చూపిస్తున్నారు. పెన్షను పెంపుపై తొలిసంతకం నుంచి, ఆశావర్కర్ల వేతనాల పెంపు వరకు ఆయన నిర్ణయాలు ప్రజల్లో కొత్త నమ్మకాన్ని నింపుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయదలచుకున్న నిర్ణయంపై కూడా ఇవాళ కేబినెట్ భేటీలో చర్చ జరుగుతుంది. లక్షలాదిగా ఉండే ఆర్టీసీ కార్మికులందరికీ రుచించే విధంగానే ఈ విషయంలోనూ నిర్ణయం ఉంటుందని అనుకోవచ్చు.

కేబినెట్ భేటీకి 8 అంశాలతో ఎజెండా సిద్ధం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటిదాకా అమల్లోకి తెచ్చిన హామీలే ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో ప్రజలకు స్పష్టత ఉంది. జగన్ సంతకం చేసిన తొలిరోజున ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన కార్యాలయంలోకి ప్రవేశించిన తొలిరోజున మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇవాల తొలి కేబినెట్ భేటీ రోజున కూడా మరో గొప్ప, కొత్త నిర్ణయం వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

నిజానికి తొలి కేబినెట్ భేటీపై ప్రజలనుంచి మాత్రమే కాకుండా, పార్టీనుంచి కూడా అంచనాలు పెద్దగా ఉన్నాయనే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు రద్దు గురించి కూడా కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుంటుంది. తద్వారా.. కొత్త బోర్డు నియామకానికి దారి సుగమం అవుతుంది. ఛైర్మన్ పదవి వైవీ సుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారు కాగా.. సభ్యత్వ హోదా కోసమైనా పార్టీలో పలువురు సీనియర్ నాయకులు పోటీపడే అవకాశం ఉంది.

మొత్తానికి తొలి కేబినెట్ భేటీ ముద్రను జగన్ ఎలా చూపిస్తారో గమనించాలి.

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?