Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ నిర్ణయం శహభాష్

జగన్ నిర్ణయం శహభాష్

కులం..మతం అనే కాలమ్ లు లేకుండా, వాటిని వెల్లడించకుండా మన దేశంలో జరిగే పనులు చాలా తక్కువ. అలాంటిది తొలిసారి ఓ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

పాఠశాలల్లో ప్రవేశానికి కులం, మతం వివరాలు ఇవ్వనవసరం లేదు అని ఆదేశించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియా శహభాష్ అంటోంది.

ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వం ఇదే కావచ్చు. జగన్ తను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేయించాలని కిందా మీదా పడ్టారు.

పేద ప్రజలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన అంటే చిన్న విషయం కాదు. కానీ దీనికి ప్రతిపక్షం, దాని వెనుక వున్న మీడియా, కుహనా మేధావులు విపరీతంగా వ్యతిరేకించారు. కోర్టులకు వెళ్లారు. 

అది అలా వుండగానే ప్రతి పాఠశాలను లక్షలు, కోట్ల ఖర్చుతో కొత్తగా తయారు చేసే కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్టయిల్ లో తయారయింది.

మరోపక్క ప్రతి విద్యార్థికి ప్రయివేటు స్కూళ్లలో మాదిరిగా యూనిఫారమ్, బెల్ట్, బ్యాగ్, పుస్తకాలు, అవి కూడా వర్క్ బుక్స్ అనే కొత్త ప్రయోగం చేపట్టారు.

ఇప్పటి వరకు ప్రయివేటు స్కూళ్లకే పరిమితం అయిన వర్క్ బుక్ పద్దతిని అది కూడా రెండు భాషల్లో ఒకే పుస్తకంలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఇప్పుడు పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి వస్తున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో కులం, మతం అన్న కాలమ్ తీసేయడం అన్మది నిజంగా అభినందనీయం.

వైయస్సార్ దగ్గర చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?