Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ ఎన్నికల టీమ్ రెడీ.. మరో 3 నెలల్లో లిస్ట్

జగన్ ఎన్నికల టీమ్ రెడీ.. మరో 3 నెలల్లో లిస్ట్

ఇటీవలే కేంద్ర మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆయా రాష్ట్రాలకు తాయిలాల్లాగా మంత్రి పదవులు ప్రకటించి కొందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మరికొందరికి షాకిచ్చారు మోదీ. 

ఏపీలో కూడా మంత్రి వర్గ విస్తరణకు వేళయింది. అయితే ఇక్కడ జిల్లాలకు వాటాలు పంచాల్సిన అవసరం లేదు. విస్తరణతో తక్షణ ప్రయోజనాలేవీ లేవు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం, 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సీఎం జగన్ విస్తరణను వినియోగించుకోబోతున్నారు.

రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని జగన్ ముందుగానే హింట్ ఇచ్చారు. అయితే టైమ్ దగ్గరపడుతున్నా దానికి సంబంధించిన సిగ్నల్స్ ఇంకా అందలేదు. ఇటీవలే నామినేటెడ్ పోస్ట్ ల భర్తీతో కాస్తో కూస్తో క్లారిటీ వచ్చింది. మరో మూడు నెలల్లోగా మంత్రి వర్గ విస్తరణ ఖాయమని అంటున్నారు.

ఇది పంపకం కాదు, ప్లానింగ్..!

ఇప్పుడు ఏపీలో జరిగే మంత్రివర్గ విస్తరణను కేవలం మంత్రి పదవుల పంపకంగా చూడడం లేదు జగన్. తన కేబినెట్ ను ఆయన రాబోయే ఎన్నికల టీమ్ గా చూస్తున్నారు. రాబోయే రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేయడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో జగన్ తో కలిసి ప్రజల్లోకి దూసుకుపోయే వాళ్లతోనే కొత్త టీమ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. పాతవారికి కూడా అవకాశం ఇచ్చారంటే, వారు కూడా ఎన్నికల టీమ్ లో ఉన్నట్టే లెక్క.

అందుకే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు అనే కంటే, జగన్ తన ఎన్నికల టీమ్ ను రెడీ చేస్తున్నారనే ప్రచారం పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. అలాంటి కీలకమైన ఎన్నికల టీమ్ ను జగన్ ఆల్రడీ సెట్ చేశారట. ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందంటున్నారు.

లీకులుండవు.. షాకులుంటాయి

జగన్ ఏది చేసినా ఆయన అనుంగు అనుచరులకు కూడా ఆ పని పూర్తయ్యే వరకు దాని వివరాలు తెలియవు. మంత్రివర్గ తొలి కూర్పులో కూడా చివరి నిముషంలో సీనియర్లు షాకయ్యారు, యువకులు పదవులు దక్కాయని సంబరపడ్డారు. ఇప్పుడు కూడా అలాంటి షాకులే ఉంటాయని అంటున్నారు. అయితే దానికి సంబంధించిన సమాచారం మాత్రం ఎవరికీ తెలియదు. లీకయ్యే అవకాశాలే లేవు.

ముందుగా లీకులిచ్చి, ప్రజామోదం తెలుసుకుని ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించే లీకువీరుడు చంద్రబాబుకి, జగన్ కి చాలా తేడా ఉంది. తాను అనుకున్న నిర్ణయాన్ని నూటికి నూరుపాళ్లు అమలు చేస్తారు. దానివల్ల కష్టమైనా, నష్టమైనా తాను భరిస్తాననే రకం జగన్. అందుకే ఎన్నికల కొత్త టీమ్ లిస్ట్ ప్రిపేర్ అయినా, ఇంకా అది బయటకు రాలేదు. మూడు నెలల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?