Advertisement

Advertisement


Home > Politics - Gossip

జగన్ తో అయ్యన్న ఒప్పందం!

జగన్ తో అయ్యన్న ఒప్పందం!

చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎల్లపుడూ సిఎమ్ జగన్ మీద ఒంటి కాలి మీద లేస్తారు. ప్రభుత్వం కూడా అదే రేంజ్ లో అయ్యన్న మీద కూడా ప్రభుత్వం అలాగే గురి పెడుతూ వుంటుంది. అలాంటిది అయ్యన్న వెళ్లి ప్రభుత్వంతో చెట్టపట్టాలేసుకుని, పెట్టుబడులు పెడతారు అంటే నమ్మగలమా? కానీ అలాంటి అనుమానమే కలుగుతోంది.ఎందుకంటే..

అయ్యన్న పాత్రుడు, ఆయన భార్య, మరి కొందరు మిత్రులు భాగస్వాములుగా విశాఖ కు భోగాపురానికి మధ్యలో సన్ రే రిసార్ట్ అనేది వుంది. ఇది చాలా పాపులర్. దీని మీదే గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్న పాత్రుడికి మధ్య గొడవ వచ్చింది. 

ఈ రిసార్డ్ ను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన లాండ్ అక్విజిషన్ లోకి తీసుకు వచ్చేయాలని అప్పట్లో గంటా ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీని మీద అయ్యన్న వెళ్లి చంద్రబాబు దగ్గర కూర్చుని, తనకు అనుకూలంగా వ్యవహారం సాధించుకున్నారు. మరి ఇప్పటికీ సన్ రే రిసార్ట్ లో అయ్యన్న, ఆయన భార్య భాగస్వాములు అనే వినిపిస్తోంది.

ఇప్పుడు నిన్నటికి నిన్న విశాఖ గ్లోబల్ మీట్ లో ‘సన్ రే విలేజ్ రిసార్ట్’ అనే సంస్థ ప్రభుత్వంతో 250 కోట్ల మేరకు పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకుంది. సన్ రే రిసార్ట్ ప్రయివేట్ లిమిటెడ్, సన్ రే విలేజ్ రిసార్డ్ ప్రయివేట్ లిమిటెడ్ రెండూ ఒకటేనా? లేదా దానికి ఇది అనుబంధ సంస్థనా అన్నది తెలియదు. అలాగే అందులో భాగస్వాములుగా, డైరక్టర్లుగా వున్న అయ్యన్న దంపతులు ఇందులో కూడా వున్నారా? లేదా? అన్నది తెలియాల్సి వుంది. 

రెండు కంపెనీలు ఒకరివే, ఒక తాను ముక్కలే అయితే జగన్ ప్రభుత్వాన్ని నమ్మి అయ్యన్న పాత్రుడు పెట్టుబడులు పెట్టారని అనుకోవాల్సి వుంటుంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా