Advertisement

Advertisement


Home > Politics - National

లాకప్ లో రీల్.. సోషల్ మీడియాలో వైరల్

లాకప్ లో రీల్.. సోషల్ మీడియాలో వైరల్

టైమ్ కి తిన్నా తినకపోయినా.. రోజుకో రీల్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకపోతే కొంతమందికి పొద్దుపోదు. అలాంటి వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా రీల్స్ షూట్ చేస్తూనే ఉంటారు. ఆ విచిత్రమైన అలవాటు ఉన్న నలుగురు యువకులు ఓ హత్య కేసులో ఇరుక్కున్నారు.

విశేషం ఏంటంటే.. ఆ నలుగురు లాకప్ లోకి వెళ్లి కూడా రీల్స్ షూట్ చేయడం మొదలు పెట్టారు. కటకటాల వెనక వాళ్లు చేసిన వీడియోలు ఇనస్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి. లైక్ లు, కామెంట్లతో వారి అకౌంట్లకు ఫాలోవర్లు కూడా పెరిగారు. అయితే అక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది. లాకప్ లో చేసిన ఆ రీల్స్ వ్యవహారం ఎస్పీ వరకు వెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ అయ్యారు.

లాకప్ లో రీల్స్ షూట్ చేసిన ఘటన రాజస్థాన్ లోని జుంజాను జిల్లాలో జరిగింది. సుల్తానా చౌక్ పోలీస్ స్టేషన్లో నలుగురు యువకులను హత్యానేరం కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. జనవరి3న చందన్ జాట్ అనే యువకుడి హత్య జరిగింది. అతడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అమిత్ జాట్, భవానీ జాట్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం నలుగురిని లాకప్ లో వేశారు.

లాకప్ లో ఉన్న ఆ నలుగురు ఊరికే ఉండలేక సెల్ ఫోన్ తీసి రీల్స్ చేశారు. చేస్తే చేశారు వాటిని అక్కడికక్కడే తమ ఇన్ స్టా అకౌంట్ లో అప్ లోడ్ చేశారు. దీంతో వ్యవహారం సోషల్ మీడియాకెక్కింది.

లాకప్ లో రీల్స్ చేయడం, అవి వైరల్ కావడం.. చివరకు పోలీసులకు తిప్పలు తెచ్చింది. లాకప్ లోకి సెల్ ఫోన్ ఎలా వెళ్లింది, అలా వెళ్లిన ఫోన్ లోంచి మళ్లీ రీల్స్ చేయడం ఏంటంటూ.. ఆ వీడియోలకు కామెంట్లు పెట్టారు చాలామంది, పనిలో పనిగా పోలీస్ డిపార్ట్ మెంట్ ఐడీలను ట్యాగ్ చేశారు. దీంతో వ్యవహారం ఎస్పీ వరకు వెళ్లింది.

ఖైదీల చేతికి మొబైల్‌ ఫోన్ ఎలా వెళ్లిందని ప్రశ్నించారు ఎస్పీ. ఖైదీలు వీడియో షూట్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని, అక్కడే ఉండి కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీశారు. ఈ ఘటనపై ఎంక్వయిరీ వేశారు. లాకప్ లో రీల్స్ తీస్తుంటే పోలీసులు తమాషా చూశారే కానీ, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారని, అది ఇంత పెద్ద రచ్చ అవుతుందని అనుకోలేదు. చివరకు ఇలా అడ్డంగా బుక్కయ్యారు రాజస్థాన్ పోలీసులు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?