Advertisement

Advertisement


Home > Politics - National

నాలుగేళ్లలో 56 శాతం పెరిగిన సిలిండర్ ధర

నాలుగేళ్లలో 56 శాతం పెరిగిన సిలిండర్ ధర

వంట గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల పెరుగుతూనే ఉంది. దీనిపై ఇచ్చిన సబ్సిడీ ఇప్పటికే హరించుకుపోయింది. తాజాగా సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కలిపి చూసుకుంటే, గడిచిన నాలుగేళ్లలో వంట గ్యాస్ ధర ఏకంగా 56 శాతం పెరిగింది.

గృహ అవసరాల కోసం వాడే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర 2019, ఏప్రిల్ 1న 706 రూపాయల 50 పైసలు ఉండేది. తర్వాత 2020లో దీని ధర 744 రూపాయలకు చేరింది. 2021లో 809 రూపాయలు, 2022లో 949.50 రూపాయలకు చేరుకుంది.

ఇక ఈ ఏడాది మార్చి 1 నాటికి ఎల్పీజీ సిలిండర్ ధర అక్షరాలా (తాజా పెంపుతో కలిపి) 1103 రూపాయలకు చేరుకుంది. దీంతో నాలుగేళ్లలో సిలిండర్ ధర 56శాతం పెరిగినట్టయింది. మరో 2-3 నెలలు గడిస్తే, గృహ అవసరాల కోసం వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న సబ్సిడీ పూర్తిగా ఎత్తేసినట్టు అవుతుంది. దీనికితోడు ఇంటికి సరఫరా చేస్తున్నందుకుగాను అనధికారికంగా డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

వంట గ్యాస్ పై ఏటా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిటీ మొత్తం 2018-19లో 37,209 కోట్ల రూపాయలుగా ఉంటే, 2021-22 సంవత్సరం నాటికి అది 1811 కోట్ల రూపాయలకు పడిపోయింది. దీన్నిబట్టి వంట గ్యాస్ ధర ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

దేశీయ ఎల్‌పిజి అమ్మకాలపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చేందుకు, చమురు కంపెనీలకు 22 వేల కోట్ల రూపాయల్ని వన్-టైమ్ పరిహారం కింద అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?