జగన్ యూనిఫార్మ్ పొలిటీషియన్

ప్రతి పొలిటీషియన్ కు ఓ యూనిఫారమ్ వుంటుంది. ఎన్టీఆర్ కాషాయం కడితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచె, లాల్చీ వేసుకున్నారు. చంద్రబాబు ఒకే తరహా ఫుల్ హ్యాండ్ షర్ట్, ఫ్యాంట్ ధరించారు.  Advertisement వైఎస్…

ప్రతి పొలిటీషియన్ కు ఓ యూనిఫారమ్ వుంటుంది. ఎన్టీఆర్ కాషాయం కడితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పంచె, లాల్చీ వేసుకున్నారు. చంద్రబాబు ఒకే తరహా ఫుల్ హ్యాండ్ షర్ట్, ఫ్యాంట్ ధరించారు. 

వైఎస్ జగన్ ఎప్పుడూ ఫార్మల్ డ్రెస్ లో సింపుల్ గా వుంటారు. అంతే కాదు షూ వేసుకోరు. క్యాజువల్ చెప్పల్స్ వేసుకుంటారు. అయితే మిగిలిన వారి సంగతి అలా వుంచితే జగన్ దగ్గరకు వచ్చేసరికి ఇంకో చిత్రం కూడా వుంది.

ఎన్టీఆర్ కాషాయం వేసుకున్నా, వైఎస్ పంచె కట్టుకున్నా అది వారి వరకే పరిమితం. ఆ చుట్టూ వున్నవారు ఎలా వుంటారన్నది వారి ఇష్టం. అంతే తప్ప వారు పట్టించుకోరు. 

కానీ జగన్ దగ్గరకు వచ్చేసరికి వేరు. ఆయన చుట్టూ వున్నవారు కూడా ఫార్మాల్ గా, సింపుల్ గా వుండాల్సిందే. షూస్, గాగుల్స్ లాంటివి వుండవు. అంతే కాదు రంగు రంగులు, పువ్వుల పువ్వులు లాంటి డ్రెస్ లు వేసుకోరు. జగన్ కు ఎలా వుంటే నచ్చుతుందో అలాగే వుంటారు.

మొన్నటికి మొన్న విజయవాడలో ఓ శంకుస్థాపన కార్యక్రమంలో చూడండి. జగన్ తో సహా చుట్టూ వున్న లీడర్లు, అధికారులు అంతా ఒకేలా యూనిఫారమ్ లో వున్నట్లు వుంటారు. అలా వున్నవాళ్లంతా మామూలుగా వున్నపుడు అలా వుండరు. కానీ జగన్ దగ్గరకు వెళ్లినా, జగన్ తో వెళ్లినా గెటప్ చేంజ్ చేయాల్సిందే.

చాలా ఏళ్ల క్రితం హీరో రాజశేఖర్ కళ్ల జోడు, టీ షర్ట్, షూస్ వేసుకుని ప్రచారానికి వెళ్తే జగన్ క్లాస్ పీకారని వార్తలు వచ్చాయి. జగన్ ఐడియా ఒకటే. జనాల ముందుకు వెళ్లినపుడు ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా వుండాలి అన్నది. అది కూడా మంచి ఐడియానే కదా.