సమ్మర్ సినిమాలపై అనుమానాలు

ఈ సమ్మర్ లో వరుసగా పెద్ద సినిమాలు విడుదల ప్లాన్ చేసి వున్నారు. మెగాస్టార్ ఆచార్య, బాలయ్య-బోయపాటి సినిమా, రవితేజ ఖలాడీ సినిమాలు మే నుంచి జూన్ మధ్యలో వున్నాయి. అయితే ఇవన్నీ అనుకున్నవి…

ఈ సమ్మర్ లో వరుసగా పెద్ద సినిమాలు విడుదల ప్లాన్ చేసి వున్నారు. మెగాస్టార్ ఆచార్య, బాలయ్య-బోయపాటి సినిమా, రవితేజ ఖలాడీ సినిమాలు మే నుంచి జూన్ మధ్యలో వున్నాయి. అయితే ఇవన్నీ అనుకున్నవి అనుకున్నట్లు విడుదల అవుతాయా? అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

ఆచార్య సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుందని అంటున్నారు. కానీ బిబి 3, ఖిలాడీ సినిమాలు వాయిదా పడే అవకాశం వుందని, వర్క్ పూర్తి కాకపోవడమే కారణమని వినిపిస్తోంది.

ఇదిలా వుంటే కరోనా వ్యవహారం కూడా భయపెడుతోంది. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ అన్నది సమస్య కాదు కానీ, ఫ్యామిలీలు భయపడి రాకపోతే పరిస్థితి ఏమిటి? అన్నది ఓ పాయింట్. ఇదిలా వుంటే మే నెల అంతా ఆంధ్రలో ఇంటర్ పరీక్షలు వున్నాయి. ఏప్రిల్ నెల అంతా ఇంటర్ ప్రాక్టికల్స్ వున్నాయి. ఇంకా టెన్త్ పరిక్షలు వుండనే వున్నాయి. 

అందువల్ల మాస్, యువత సినిమాలకు వస్తే రావచ్చు కానీ ఫ్యామిలీలు వస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్యామిలీలు రాకుంటే కోట్లకు కోట్లు పెట్టి కొంటే పరిస్థితి ఏమిటి? అన్నది మరో భయం. పైగా ఆచార్య, వకీల్ సాబ్ లాంటి సినిమాలు అతి భయంకరమైన రేట్లకు అమ్మేసారు. 

ఉప్పెన ఇచ్చిన ధైర్యంతో జనాలు కొనేసారు. ఇప్పుడు కరోనా వ్యవహారం చూసి ముందు వెనుకలు ఆడుతున్నారు. నాలుగైదు జిల్లాల్లో కరోనా తీవ్రంగా వుంది. తీరా సినిమాలు విడుదలయ్యాక ఒక్కసారి కేసులు పెరిగితే పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రశ్నగా వుంది. 

మొత్తం మీద ఈ ఏడాది సమ్మర్ సినిమాలకు కాస్త కష్టంగానే వుండేలా వుంది.