Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'వకీలు' లో 'పొగరు' డైలాగు

'వకీలు' లో 'పొగరు' డైలాగు

ఈ దేశపు జెండాకు వున్నంత పొగరు వుంది నాకు అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడిన భలే డైలాగు. నిజానికి జెండాకు పొగరు ఏమిటో? ఆ వ్యవహారం అంతా వేరే సంగతి. 

ఇంతకీ లేటెస్ట్ విషయం ఏమిటంటే రాబోతున్న వకీల్ సాబ్ లో మళ్లీ అలాంటి డైలాగు ఒకటి పేల్చినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే పంచ్ డైలాగులు వుండాలి. వాటిని మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా ఎక్కడ పడితే అక్కడ వాడుకునేలా వుండాలి. వకీల్ సాబ్ లో కూడా అలాంటి డైలాగులకు కొదవ లేదు. 

అయితే ఆ డైలాగుల్లో ' పొగరు ' లాంటి డైలాగు కూడా ఒకటి వుందని తెలుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఓ మాటను ఉదహరిస్తూ, ఆ మాటలకు వున్నంత పొగరు వుంది నాకు అనే టైపులో పవన్ డైలాగు చెప్తారని తెలుస్తోంది. 

ఈ డైలాగుకు కాస్త పొలిటికల్ టచ్ లేదా పొలిటికల్ మైలేజీ కూడా వుండేలా సెట్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ నే ఈ డైలాగును స్వయంగా కాయిన్ చేసారని బోగట్టా. సినిమా వస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?