విజయనగరం సంస్థానధీశుడు, కేంద్ర మాజీ మంత్రి, బాబుతో సరిసాటి రాజకీయాలు నెరిపిన సీనియర్ నేత అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు సరైన సమయంలో షాక్ ఇచ్చేశారు.
పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు బాబుకు పట్టవా అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న అంశం మీద చంద్రబాబు నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశానికి కూడా అశోక్ డుమ్మా కొట్టారు. మొత్తానికి చూస్తే బాబు పోకడల పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న అశోక్ సరైన సమయంలో బాబుతో విభేదించారని అంతా అంటున్నారు.
నిజానికి ఎన్నికలను బహిష్కరించే నిర్ణయం చాలా మంది పార్టీ నాయకులకు అసలు రుచించడంలేదు. ఎన్నికల్లో పోరాడితేనే ఫలితం ఉంటుంది అన్నది సీనియర్ల మాట. అది అశోక్ గొంతు నుంచి వచ్చిందని అంటున్నారు. మరి అశోక్ అసంతృప్తిని బాబు ఎలా తీసుకుంటారో చూడాలని అంటున్నారు.