Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఢిల్లీకి జగన్: హోదా కోసమా.. దోస్తీ కోసమా!

ఢిల్లీకి జగన్: హోదా కోసమా.. దోస్తీ కోసమా!

ఓ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం మామూలే. గతంలో చంద్రబాబు సందు దొరికితే ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వాలిపోయేవారు. కానీ ఈసారి జగన్ చేస్తున్న ఢిల్లీ పర్యటన అలాంటిది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది. మరెంతో కీలకమైనది కూడా. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు జగన్. అంతకంటే ముందు ఓసారి ఢిల్లీ వెళ్లి మోడీని కలిసినప్పటికీ అప్పటికి ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈసారి మాత్రం పూర్తి అధికారికంగా ఢిల్లీ టూర్ కు రెడీ అయ్యారు. ఓవైపు ప్రత్యేకహోదా అంశం, మరోవైపు బీజేపీ నుంచి వస్తున్న ప్రలోభాల నేపథ్యంలో జగన్ ఎటువైపు మొగ్గుతారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

కేంద్రంలో ఎన్డీఏలో చేరితే పార్లమెంట్ లో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ హోదా కల్పిస్తామంటూ ఇప్పటికే ఆఫర్ ఇచ్చింది బీజేపీ. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని జగన్ మాట దాటేశారు. నిజానికి వైసీపీ మద్దతు బీజేపీకి అవసరం లేదు. బీజేపీ సపోర్ట్ కూడా జగన్ సర్కార్ కు అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు పార్టీలు ఏదో ఒకచోట చేతులు కలపాలి. అది ఏ పాయింట్ వద్ద అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బీజేపీతో వైసీపీ చేతులు కలిపితే అది కేవలం ప్రత్యేకహోదా సాధన దిశగానే అయిఉండాలి. స్పెషల్ స్టేటస్ కాకుండా మరే అంశం ప్రాతిపదికన ఈ రెండు పార్టీలు కలిసినా రాష్ట్రంలో జగన్ కు చెడ్డపేరు తప్పదు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే, జగన్ ఢిల్లీ వెళ్తే అది ప్రత్యేకహోదా సాధనకోసమే అనేంతలా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్ కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నారు. కానీ బీజేపీ ఆఫర్లను తిరస్కరిస్తే, అది మొదటికే మోసం తెచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు.

అందుకే జగన్ పూర్తిగా సమాయత్తమయ్యారు. ప్రత్యేకహోదా విషయంలో జగన్ ఓ నివేదిక తయారుచేసుకున్నారు. రేపు జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో ఆ నివేదికను ప్రధాని మోడీకి అందించబోతున్నారు. మరోవైపు ఇదే అంశంపై ఈరోజు సాయంత్రం హోంమంత్రి అమిత్ షాతో చర్చించబోతున్నారు. ఏదేమైనా జగన్ చేపడుతున్న ఈ తొలి ఢిల్లీ పర్యటనలోనే ప్రత్యేక హోదాపై ప్రకటన వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ ఆ దిశగా ఏ చిన్న ప్రకటన వచ్చినా అది జగన్ సాధించిన విజయమే అవుతుంది. 

పవనమా? ఋతుపవనమా? ఈ పవనమెటు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?