Advertisement

Advertisement


Home > Politics - Gossip

జనసేన పతనం.. జనసైనికుల చేతుల్లోనే!

జనసేన పతనం.. జనసైనికుల చేతుల్లోనే!

తమ సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు జనసైనికులు. శాసనసభ తొలిరోజు సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ ని కలసిన జనసేన ఎమ్మెల్యే కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని జనసేన ఎమ్మెల్యే ప్రశంసించారు. జగన్ ప్రభుత్వానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ హామీలన్నిటినీ నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.

రాపాక అలా మాట్లాడారో లేదో సోషల్ మీడియాలో జనసైనికులు రెచ్చిపోయారు. జనసేన ఎమ్మెల్యే జగన్ ని కలవడం ఏంటి? మంత్రివర్గ విస్తరణ గురించి ప్రశంసించడం ఏంటి? అసలు జనసేనలో ఉండాలనుకుంటున్నారా లేదా? అంటూ తిట్ల దండకం మొదలుపెట్టారు. ఉంటే ఉండండి, లేకపోతే పొండి అంటూ కవ్వించే కామెంట్లు పెట్టారు.

నిజానికి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎక్కడా తాను పార్టీ మారుతున్నానని కానీ, పవన్ పై నమ్మకం లేదని కానీ చెప్పలేదు. వైసీపీలోకి వెళ్తే 152వ ఎమ్మెల్యేగా ఉంటానని, కానీ జనసేనలో తనది నెంబర్ వన్ పొజిషన్ అంటూ గతంలో తన నిజాయితీని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు జనసైనికులు చేస్తున్న ఓవర్ యాక్షన్ తో ఆయన మనసు గాయపడిందని అంటున్నారు.

గెలిచిన తర్వాత మద్దతు తెలపకపోగా.. ఇప్పుడు జగన్ ను లాంఛనప్రాయంగా కలిసినందుకు నిందలు వేస్తారా అంటూ సన్నిహితుల దగ్గర బాధపడ్డారు రాపాక. ప్రతిసారీ పవన్ కల్యాణ్ ని కలసి తన పాతివ్రత్యం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. తమ ఓవర్ యాక్షన్ తో జనసైనికులే.. దగ్గరుండి తమ ఏకైక ఎమ్మెల్యేని పక్కపార్టీలోకి సాగనంపేలా ఉన్నారు. పార్టీలో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యేను అల్లారుముద్దుగా చూసుకోవాల్సింది పోయి, ఇలా ట్రోలింగ్ చేయడం ముమ్మాటికీ తప్పే.

గాజువాకలో అయితే బొత్తిగా తృతీయస్థానం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?