జనసేనాధిపతి ఎక్కడున్నారు?

జనసేనాధిపతి ఎక్కడున్నారు? ఆయన అమెరికా వెళ్లారని అత్యంత విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పటికే అమెరికా వెళ్లి నాలుగైదు రోజులు దాటిపోయింది.  Advertisement ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలుస్తోంది. పార్టీని ఆర్థికంగా బలోపేతం…

జనసేనాధిపతి ఎక్కడున్నారు? ఆయన అమెరికా వెళ్లారని అత్యంత విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఇప్పటికే అమెరికా వెళ్లి నాలుగైదు రోజులు దాటిపోయింది. 

ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలుస్తోంది. పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసే పనిలో భాగంగా పవన్ అమెరికా వెళ్లారని బోగట్టా. అయితే అలాంటి ఫండ్ రైజింగ్ వ్యవహారాలు వుంటే అమెరికాలోని జనసేన జనాలకు కానీ, సామాజిక వర్గ జనాలకు కానీ అస్సలు సమాచారం లేదు.

పవన్ ప్రస్తుతం టెక్సాస్ లో వున్నారని, ఈ శనివారం బయలుదేరి వచ్చే అవకాశం వుందని, అలా రాలేక పోతే, మరో నాలుగు రోజులు అక్కడే వుంటారని కూడా తెలుస్తోంది. 

అన్ని రోజులు అమెరికాలో వుండే వ్యక్తిగత పని ఏమిటన్నదే క్వశ్చను. మరెవరైనా అయితే ఇలా అడిగే రైటు మీడియాకు లేదు. బట్ సెలబ్రిటీ కావడం, రాజకీయాల్లో వుండడంతో సహజంగా మీడియా దృష్టి పవన్ మీద వుంటుంది.

పవన్ అమెరికాకు వెళ్లారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అవి తప్పు అయి వుంటే జనసేన సోషల్ మీడియా ఇప్పటికే ఒక రేంజ్ లో ఖండించి వుండేది. లేదా ఫేక్ న్యూస్ అంటూ విరుచుకుపడేది. కానీ అలా చేయలెేదు. 

ఇవ్వాళో రేపో పవన్ తిరిగి వస్తే ఎలాగూ తెలుస్తుంది. అప్పటి వరకు పవన్ ఎక్కడ వున్నారు అని అనుకోవడం తప్ప, అధికారికంగా సమాధానం అయితే రాదు.