షాకింగ్!.. కేసీఆర్ పార్టీలోకి జేసీ బ్ర‌ద‌ర్స్ జంప్!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా ఉన్న‌ప్పుడు ఒక వైపులో ప్ర‌తేక్య తెలంగాణ నినాదం, మ‌రో వైపు సమైక్యాంధ్ర ఉద్య‌మం న‌డుస్తుంటే అప్ప‌టి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రే రాయ‌ల తెలంగాణ అంటూ స‌రికొత్త…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా ఉన్న‌ప్పుడు ఒక వైపులో ప్ర‌తేక్య తెలంగాణ నినాదం, మ‌రో వైపు సమైక్యాంధ్ర ఉద్య‌మం న‌డుస్తుంటే అప్ప‌టి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రే రాయ‌ల తెలంగాణ అంటూ స‌రికొత్త నినాదం చేశారు. అప్ప‌ట్లో అది సాధ్యం కాక‌పోగా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ భూస్ధాపితం అయిన త‌ర్వాత త‌న ప్ర‌త్య‌ర్ధి పార్టీ అయిన టీడీపీ చేరి దివాక‌ర్ రెడ్డి ఎంపీగా, త‌మ్ముడు ఎమ్మెల్యేగా అయ్యారు. అధికారంలో ఉన్న టీడీపీపై ఎప్ప‌టిక‌ప్పుడు అసంతృప్తి వెళ్ల‌గ‌క్కుతునే ఉన్నారు. త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో జేసీ వార‌సులు ఇద్ద‌రు ఓడిపోవ‌డంతో తాడిప‌త్రి త‌మ ఉనికి కూడా ప్ర‌శ్న‌ర్ధ‌కం అయ్యింది.

తెలంగాణ సీఎం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీగా అడుగులు వేస్తుండంతో ఆంధ్ర‌లోని టీడీపీ, వైసీపీ అంస‌తృప్తి నేత‌లు కొంద‌రు కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇందులో ముందు వ‌రుస‌లో జేసీ బ్ర‌ద‌ర్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం క‌ష్టం అని, బీజేపీ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భావం లేద‌ని గ్ర‌హించి కేసీఆర్ పార్టీ వైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కేసీఆర్ జాతీయ పార్టీలో చేరితే అధికార వైసీపీ నుండి విమర్శలు త‌గ్గుతాయ‌ని, త‌న బ‌స్సులు కూడా తెలంగాణ నుండి ఇత‌ర రాష్ట్రాల్లో తిప్పుకోవచ్చని, త‌మ బిజినెస్ కి కూడా కేసీఆర్ పార్టీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్ని అలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు కూడా కాస్తో కూస్తో ప్ర‌జ‌ల్లో ఉన్న నాయ‌కులు కావాలి కాబ‌ట్టి జేసీ బ్ర‌ద‌ర్స్ కూడా ఓకే చెప్పిన‌ట్లు తాడిప‌త్రి వ‌ర్గాలు నుండి వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాయ‌ల తెలంగాణ ఎలాగు రాలేదు. క‌నీసం పార్టీని రాయ‌ల‌సీమ‌లో బ‌లోపేతం చేస్తే రైతుల కొసం కృష్ణా సాగునీరుతో పాటు, రాయ‌ల‌సీమ కోసం కేసీఆర్ తో ప్ర‌తేక్య ప్రాకేజీ ప్ర‌క‌టిస్తార‌ని చెప్పి కేసీఆర్ పార్టీకి రాయ‌ల‌సీమ‌ నుండి క‌నీసం రెండు, మూడు ఎంపీ స్ధానాలు అయిన గెల‌పించి ఇస్తామ‌ని జేసీ బ్ర‌ద‌ర్స్ హామి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జేసీ అనుచ‌రుల‌కు త్వరలో మ‌న ప్ర‌యాణం కేసీఆర్ తోనే అని చెప్పుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న త‌ర్వాత జేసీ బ్ర‌ద‌ర్స్ నే మొద‌టి జాంపిగ్ అవ్వ‌చ్చు.

బహుశా టీడీపీలో కంటే కేసిఆర్ పార్టీలోనే సరైనా గౌరవం ఉంటుందని జేసీ వారసులు కూడా పెద్ద‌ల‌కు చెప్పిండొచ్చు అంటున్నారు జేసీ అనుచరులు.