ఆంధ్రప్రదేశ్ కి తీరని గాయం చేశామని దానిని అంగీకరిస్తున్నమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్. అలాగే మరో విభజన రచయిత అయిన జైరాం రమేష్ ఒక అడుగు ముందుకు వేసి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. విభజన చేసే టైంలోనే ప్రత్యేక హోదా ఇచ్చేసుంటే కనీసం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఊపిరితో అయిన ఉండేది కాదా అనే విషయం మర్చిపోయినట్లు ఉన్నారు.
ఇవాళ కర్నూల్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గురించి ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో దిగ్వజయ్ సింగ్, జైరాం రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రకు అన్యాయం చేసిందన్నారు. ఈ నెల 18న కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీదనే అని సృష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బతకాలంటే ఎన్ని పాదయాత్ర చేసినా, ఎన్ని పొర్లు దండాలు చేసిన ఆంధ్ర జనాలు ఓట్లు వేయారు అనే విషయం వారికి కూడా తెలుసు. అందుకే ఆంధ్రలో 4 రోజులు రాహుల్ పాదయాత్ర ఉంటే తెలంగాణలో 13 రోజులు పాదయాత్ర చేయబోతున్నారు. బహుశ ఆంధ్రలో ఉన్న కాంగ్రెస్ వృద్ధ నాయకులు తప్పా ప్రజలు ఎవరూ రాహుల్ పాదయాత్రలో కనపడకపోవచ్చు అంటూన్నారు రాజకీయ విశ్లేషకులు.
భారత్ జోడో యాత్ర తమిళనాడులో మొదలై కేరళ, కర్ణాటక రాష్ట్రాలను దాటుకొని ఈనెల 18న ఏపీలోని కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర మొదలవనుంది.